శెట్టి గారి నుంచి జైట్లీ వరకు!
అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. 1947 నవంబర్ 26వ తేదీ. సరిగ్గా ఆ రోజున ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు.. ఇన్నాళ్ల తర్వాత దేశానికి 84వ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు.
దేశ విభజన తర్వాత ఢిల్లీ, ఇస్లామాబాద్లలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశానికి సబంధించి ఏడున్నర నెలల కాలానికి గాను 171.15 కోట్ల రూపాయల అంచనాతో మన దేశ బడ్జెట్ను షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి ద్రవ్యలోటును రూ. 24.59 కోట్లుగా అంచనా వేశారు.