shanmukham chetty
-
బడ్జెట్ టీమ్‌లో ఎవరుంటారు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ టీమ్ లో ఎవరుంటారో తెలుసా? ఇప్పటికీ చాలా ఆర్థిక బడ్జెట్ లు మనకు సుపరిచితమే అయినా అసలు ఆ టీమ్ లో ఎవరుంటారనేది దానిపై సందేహాలు ఉండక మానవు. * మొదటి టీమ్ (పొలిటికల్): అరుణ్‌జైట్లీ, జయంత్ సిన్హా, ఎన్.ఐ.టి.ఐ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఆర్థిక సలహాదారులు అరవింద్ సుబ్రమణియన్. *రెండోటీమ్ (అధికారిక): ఎఫ్.ఎస్. మెహ్రిషి, రెవెన్యూ సెక్రటరీ శక్తికంటా దాస్, ఫైనాన్షియల్ సెక్రెటరీ డా.హస్ముక్ అద్హియా, డిసిన్వెస్ట్మెంట్ సెక్రటరీ అరదాన జోహ్రి, సీబీడీటీ చైర్ పర్సన్ కపూర్, సీబీఈసీ చైర్పర్సన్ కౌషల్ శ్రీవాత్సవ్, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తిగా రజత్ భార్గవ, జేఎస్‌లు ఉంటారు. -
మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడో.. ఎవరో తెలుసా?
స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? నాటి ఆర్థికమంత్రి షణ్ముఖం చెట్టి. ఆయనే 1948-49 సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్, ఇంటెరిమ్ బడ్జెట్ అనే పదాన్ని మొదటిసారి తన బడ్జెట్ ప్రసంగంలో పరిచయం చేశారు. ఈస్టిండియా కంపెనీ నుంచి అధికార పగ్గాలు బ్రిటిష్ ప్రభుత్వానికి చేతులు మారిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటల సమయంలో వెలువరించడం అనే సంప్రదాయాన్ని 1924లో సర్ బాసిల్ బ్లాకెట్ ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి రాత్రంతా పనిచేసిన ఉద్యోగులకు కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత క్రమంగా అది ఉదయానికి మారిపోయింది. బడ్జెట్ చరిత్ర మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను కేవలం ఏడున్నర నెలలకు మాత్రమే రూపొందించారు. దీనిని 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు రూపొందించారు. గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మత్తయ్ సమర్పించారు. -
శెట్టి గారి నుంచి జైట్లీ వరకు!
అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం. 1947 నవంబర్ 26వ తేదీ. సరిగ్గా ఆ రోజున ఆర్థికమంత్రి ఆర్.కె. షణ్ముఖం శెట్టి స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు.. ఇన్నాళ్ల తర్వాత దేశానికి 84వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. దేశ విభజన తర్వాత ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశానికి సబంధించి ఏడున్నర నెలల కాలానికి గాను 171.15 కోట్ల రూపాయల అంచనాతో మన దేశ బడ్జెట్‌ను షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి ద్రవ్యలోటును రూ. 24.59 కోట్లుగా అంచనా వేశారు.