
ఏపీ, తెలంగాణకు దక్కని ఐఐఎం
న్యూఢిల్లీ: దేశంలో 5 కొత్త ఐఐఎం, 5 కొత్త ఐఐటీ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఐఎం దక్కలేదు. ఏపీలో ఐఐటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏపీ, రాజస్థాన్ లో వ్యవసాయ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. హర్యానా, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. వీటన్నింటి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రూ.100 కోట్లతో వ్యవసాయ౦ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. జార్కండ్, అసోం రాష్ట్రాల్లో వ్యవసాయ పరిశోధనా సంస్థలను నెలకొల్పుతామని జైట్లీ హామీయిచ్చారు. మదర్సాల ఆధునీకరణకు రూ. 100 కోట్లు కేటాయించారు.