ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం! | Gen-Z Slang Is Revolutionizing Work Jargon | Sakshi
Sakshi News home page

Gen Z: ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!

Published Sat, Aug 17 2024 5:26 AM | Last Updated on Sat, Aug 17 2024 7:57 AM

Gen-Z Slang Is Revolutionizing Work Jargon

సరి్టఫికెట్లు, రొటీన్‌ బహుమతులకు గుడ్‌బై 

డిజిటల్‌ బాట పడుతున్న కార్పొరేట్లు.. 

బ్యాడ్జ్‌లు, పాయింట్లు తదితర రూపాల్లో గుర్తింపు 

అంతా జెన్‌ జడ్‌ మహిమే అంటున్న విశ్లేషకులు

ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్‌ జెడ్‌ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్‌ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్‌ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్‌ బాట పడుతూ ‘సోషల్‌’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.

భారత కార్పొరేట్‌ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్‌ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. 

ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్‌ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్‌ మూడు షేర్‌.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్‌ ఇండియా ‘సిటిజన్‌ ఆఫ్‌ ‘యూ’నివర్స్‌’ పేరుతో ‘పాస్‌పోర్ట్‌’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్‌ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసేస్తున్నారు. 

ఆఫీస్‌ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్‌’పై స్టాంప్‌ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్‌ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ సోనాలి దేసర్కార్‌ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ ఇండియా కూడా అప్లాజ్‌ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్‌ఫోన్‌ల నుంచి ఈవెంట్‌ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.

అంతా ‘సోషల్‌’మయం... 
ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్‌ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్‌ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్‌బోర్డ్‌లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్‌ డిజిటల్‌ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్‌ చెప్పారు. ఇక మెర్క్‌ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్‌ ఆధారిత అవార్డులు, స్పాట్‌ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్‌స్టేట్‌ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్‌ చేసుకోవచ్చు.

డిజిటల్‌ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యం
ఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్‌ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్‌ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్‌ సమర్థ  సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్‌ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్‌ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్‌ డిజిటల్‌ ఇండియా ఎండీ మిలింద్‌ షా అభిప్రాయపడ్డారు.  

→ ఎప్సిలాన్‌ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్‌’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్‌ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ  ఉద్యోగులకు ‘స్టాంప్‌’ పడుతుంది. సోషల్‌ మీడియాలో ప్రతిదీ షేర్‌ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!

→ రోషె ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ ‘అప్లాజ్‌’ పేరుతో అంతర్గత స్టోర్‌ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్‌ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.

→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్‌ బ్యాడ్జ్‌లు (బెస్ట్‌ ఎంప్లాయీ ఆఫ్‌ ది మంత్‌ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

→ మెర్క్‌ ఇండియా, ఆల్‌స్టేట్‌ ఇండియా, థ్రైవ్‌ డిజిటల్‌లీడర్షిప్‌ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement