నోట్లమార్పిడి వ్యవహారంలో ముగ్గురిపై వేటు | 3 suspend in notes exchange case | Sakshi
Sakshi News home page

నోట్లమార్పిడి వ్యవహారంలో ముగ్గురిపై వేటు

Published Mon, Nov 28 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

3 suspend in notes exchange case

మహానంది: మహానంది దేవస్థానంలో వివిధ కౌంటర్లలో జరిగిన నోట్ల మార్పిడి  వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ శంకర వరప్రసాద్‌  సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బుకింగ్‌ కౌంటర్‌లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో పనిచేస్తున్న మహేశ్వరీ, వెంకటేశ్వర్లు ఆలియాస్‌ శివప్ప, లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తున్న డీబీ శివకుమార్‌లను ససెన్షన్‌ చేసినట్లు సూపరింటెండెంట్‌ పరశురామశాస్త్రి తెలిపారు. ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా  వ్యవహరించిన  ఇద్దరు ఉద్యోగులను వదిలేయడం వెనుక పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ చిరుద్యోగిని బెదిరించి తన పేరు చెప్పవద్దని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement