సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్‌స్టాని వాడడంతో అందులో బగ్ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్ గెలుచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన విద్యార్థి నీరజ్ శర్మ.. తన ఫోన్‌లో ఇన్‌స్టా వాడుతుండగా అందులో ఓ బగ్ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్ లాగిన్, పాస్‌వర్డ్ లేకుండా అతని ఖాతాలోని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ థంబ్‌నైల్స్ మార్చేందుకు ఈ బగ్ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్‌కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్‌బుక్ శర్మకి $45,000 రివార్డ్‌ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్‌ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది.
చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్!
Comments
Please login to add a commentAdd a comment