National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది.
అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది.
అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది.
(చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment