సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఓ కొత్త ఆఫర్ ప్రకటించింది. బగ్స్ సులువుగా కనిపెట్టే వారికి గూగుల్ ఆఫర్ మరింత ఉపయోగపడనుంది. అదేంటంటే.. గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో బగ్స్‌ని కనుక్కుని సంస్థకు సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 66 వేలు) అందిస్తామని గూగుల్ ప్రకటించింది.