ఫేస్‌బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?
న్యూయార్క్: ఫేస్బుక్లో బగ్స్ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాదు తాము ఇప్పటి వరకు నగదు రూపంలో చెల్లించిన మొత్తాల్లో ఇండియన్స్ కే అధిక వాటా ఉందని కూడా తెలిపింది.
'బగ్స్‌ను ఏరివేసే కార్యక్రమంలో మొత్తం 127 దేశాలకు చెందిన టెక్నాలజీ రీసెర్చర్స్, హ్యాకర్స్ పాల్గొంటుండగా అందులో భారత్ మాత్రమే టాప్ స్థానంలో ఉంది. అంతేకాకుండా పెద్దమొత్తాల్లో చెల్లింపులు పొందుతున్న దేశాల్లో కూడా భారత్ దే అగ్రస్థానం' అని ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్లోని ఫేస్ బుక్ బగ్ హంటర్స్కు ఇప్పటి వరకు రూ.4.84 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. ఈ కార్యక్రమం తాము 2011లో ప్రారంభించినట్లు వెల్లడించింది.