Infected individuals
-
పాక్‌లో ప్రాణాంతక వైరస్.. భారత్‌కూ ముప్పు?
పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్ఎఫ్(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపిన వివరాల ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలాకష్టం. చికిత్స కూడా అంతసులభమేమీ కాదు. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్ (పేలు తరహాలోని పరాన్న జీవి) కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షలాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులకు ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.సీసీహెచ్ఎఫ్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్ఎఫ్ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. -
నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఓ ఖైదీ అనూహ్యంగా జైల్లోనే చనిపోయాడు. అయితే అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఎందువల్ల అతను చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ పట్టుబట్టారు. అతను నల్లుల కారణంగానే చనిపోయాడని, జైల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన అమెరికాలో అట్లాంటాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి జూన్ 12, 2022న అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను ఫుల్టన్ కౌంటీ జైలుకి తరలించారు. అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి అధికారుల అతని మానసిక రోగుల విభాగంలోకి సెప్టంబర్ 13, 20222న మార్చారు. ఆ తర్వాత మూడు నెలలకే అతను అనుహ్యంగా చనిపోయాడు. థాంప్సన్ ఉంచిన గది ఒక రోగిని ఉంచాల్సిన సెల్ కాదని, చాలా అపరిశుభ్రంగా ఉందని అతడి బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న నల్లుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపణలు చేశారు. అలాగే పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన నల్లుల దాడి జరిగిందని తేలింది. దీంతో అతను ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశారు ఆ ఖైదీ బంధువులు. దీంతో ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులను ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెల్లో ఉన్న మిగతా ఖైదీల భద్రతా ప్రోటోకాల్‌పై విచారణ చేయడమే గాక సంరక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించింది. అక్కడ ఉన్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై తనీఖీలు నిర్వహించడమేగాక, ఏదైనా ఆరోపణ రుజవైతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. అయితే నల్లులు ప్రాణాంతకం కాదని, కొన్ని అరుదైన సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుందన్నారు కెంటకీ విశ్వవిద్యాలయ శ్రాస్తవేత్త. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని కూడా చెప్పారు. (చదవండి: హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!) -
ఎయిడ్స్ అంటించావ్.. క్షమించేది లేదు
లండన్ : తనకున్న సుఖవ్యాధిని కావాలనే పది మందికి అంటించిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. దయతో శిక్ష తగ్గించాలన్న అతగాడి విజ్ఞప్తిని కోర్టు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చింది. ‘ఐదుగురి జీవితాలను నాశనం చేసిన నీకు బయటతిరిగే హక్కు లేదు’ అంటూ ఓ బ్రిటన్ కోర్టు.. జీవిత శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బ్రిగ్టోన్కు చెందిన డరైల్ రోవ్(27) ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్ డ్రెస్సర్. విలాసాలకు మరిగిన ఇతగాడికి 2015 లో ఎయిడ్స్ వ్యాధి సోకింది,(తల్లిదండ్రుల నుంచే సోకిందని అతని బంధువు ఒకరు చెప్పటం విశేషం). అయినప్పటికీ ఓ ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఐదుగురు పురుషులతో సంబంధాలను కొనసాగించాడు. వారితో రక్షణ లేకుండానే లైంగిక చర్యల్లో పాల్గొనటం.. తద్వారా వారికీ హెచ్ఐవీ సోకింది. డరైల్ చేష్టలు ఇక్కడితో ఆగలేదు. ‘నాకు ఎయిడ్స్ ఉందోచ్’ అంటూ సందేశాలు పెట్టాడు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతన్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతను పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల యత్నించారు. చివరకు వాస్తవాలు తేలటంతో నేరం అంగీకరించాడు. అతని శాడిజంపై బ్రిగ్టోన్ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎందరో యువకుల జీవితాలను రాక్షసంగా నువ్వు నాశనం చేశావ్. పైగా సురక్షిత శృంగారానికి వీలున్నా.. కావాలనే నిరాకరించావ్. నీలాంటి వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. జీవిత కాల శిక్షే సరైంది’ అని జడ్జి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. -
మనవారేనని వదిలేస్తారా..!
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయలు బకాయి పడితే సామాన్యుడికి షాకిస్తున్న సీపీడీసీఎల్... పెద్దల బకాయిలపై నోరు మెదపడంలేదు. బడా వ్యక్తులు, ఉద్యోగ సంఘాల బకాయిలు లక్షల్లో పేరుకుపోయినా మిన్నకుడం గమనార్హం. సీపీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగ సంఘాల్లో ఒక్కో సంఘం చెల్లించాల్సిన బకాయి లు రూ.లక్షకు పైగా ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిని వదిలేసి అల్పాదాయ వర్గాలపై ప్రతాపం చూపుతున్న విద్యుత్‌శాఖ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పైనే ప్రతాపం ఎలక్ట్రిసిటీ రెవెన్యూ చట్టం ప్రకారం విద్యుత్‌ను వినియోగిస్తున్న వారెవరైనా సంస్థకు బిల్లు చెల్లించాల్సిందే. కానీ ఈ బిల్లు వసూళ్లలో అధికారులు మాత్రం స్థానిబట్టి వివక్ష చూపుతున్నారు. సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుడి విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారం ఉన్నా, అధికారులు మాత్రం ఈ చట్టాన్ని నిరుపేదలకే వర్తింపజేసి కనెక్షన్లు తొలగించడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, పార్టీ ఆఫీసులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఏళ్లకు యేళ్లుగా కరెంట్ బిల్లు కట్టకపోయినా పట్టించుకోని డిస్కం నెలసరి బిల్లుల పేరుతో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బడా బకాయిదారులందరికీ విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా..ఆయా వ్యక్తుల ఇళ్లల్లో మాత్రం వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి. ఇంటి దొంగలను పట్టించుకోని సీఎండీ బిల్లు కట్టలేదనే నెపంతో వారం రోజుల క్రితం గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, రెండు నెలలుగా బిల్లు చెల్లించడ ం లేదంటూ ఈనెల 26న బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయానికి సరఫరా నిలిపివేసింది. రెండు రోజుల క్రితం బిల్లు చెల్లించలేదని బేగంబజార్‌లోని ఓ వస్త్రవ్యాపారికి సంబంధించిన కనెక్షన్ కట్ చేయడంతో వ్యాపారులంతా ఆందోళనకు దిగిన విష యం విధితమే. తాజాగా శనివారం టోలీచౌకీ బల్దియా వార్డు కార్యాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సామాన్యులు, ప్రభుత్వ కార్యాలయాల క నెక్షన్లు కట్ చేస్తున్న సీపీడీసీఎల్ సీఎండీ తమ ఇంటి దొంగలను మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాభై రూపాయలు బకాయి పడినా కనెక్షన్ తొలగిస్తామని చెప్పే అధికారులు లక్షల్లో బకాయి పడినవాని ఏ విధంగా వదిలేస్తున్నారో వారికే తెలియాలి.