● సీపీ ఏవీ రంగనాథ్
వరంగల్ క్రైం : సెల్‌ఫోన్ పోయిందా ..అధైర్యపడవద్దని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడింటి రిజిస్టార్ (సీఈఐఆర్)లో కొ న్ని వివరాలు నమోదు చేస్తే ఫోన్ ఎక్కడుందో తెలు సుకునే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, ఫోన్ పోతే బాధపడొద్దని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్‌ఫో న్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టే షన్‌లో ఫిర్యాదు చేసి rwww.ceir.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని తెలిపారు.
అందులో ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మోడల్, సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన బిల్లు తదితర వివరాలు నమోదు చేయాల న్నారు. దీంతో పాటు రాష్త్రం, జిల్లా, మండలం, తదితర వివరాలను నమోదు చేస్తే 24 గంటల్లో ఫోన్ పనిచేయకుండా చేస్తుందని తెలిపారు.
అవగాహన కల్పించాలి...
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఫోన్ పోతే ఏం చేయాలనే విషయాలపై, సీఈఐఆర్‌పై అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. దీంతో పాటు ప్రజలకు అ వగాహన కల్పించడానికి పోస్టర్లు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment