భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఏ రోజు బంగారం ధర తగ్గుతుందో అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజు బంగారం ధర ఎంతుందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) సులువైన అవకాశం కల్పించింది.
మిస్డ్ కాల్ ఇస్తే చాలు
పసిడి కొనుగోలుదారులు ఏ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన 8955664433 మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఆ రోజు పసిడి ధరలు ఎస్సెమ్మెస్ రూపంలో వెంటనే మొబైల్‌కు వచ్చేస్తాయి. అలాగే ఐబీజేఏ అధికారిక వెబ్‌సైట్ కూడా సందర్శించవచ్చు.
ఐబీజేఏ గురించి..
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) అనేది దేశంలోని పసిడి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన సంస్థ. 1919లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని బులియన్, జ్యువెలరీ అసోసియేషన్‌లకు దీన్ని అపెక్స్ అసోసియేషన్‌గా పరిగణిస్తారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్పటికి ఉన్న బంగారం ధరలను ప్రచురిస్తుంది.
బంగారం ధరలు
Gold Rates today: ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. దేశంలో ఈరోజు (అక్టోబర్ 25) సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,560 ఉండగా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,110 ఉంది. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment