![Why Gold Rate is Increasing and Who Decided Rates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/gold-rate.jpg.webp?itok=CLJyAX0B)
భారతదేశంలో బంగారంకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటు ఎలా పెరుగుతుంది? ధరలను ఎవరు నిర్ధారిస్తారు? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
బంగారం స్వచ్చతను బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. అవి 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్. నేడు (ఫిబ్రవరి 11) 22 క్యారెట్స్ 10 గ్రా ధర రూ. 80100, 24 క్యారెట్ తులం ధర రూ. 87380 వద్ద ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. 65540 వద్ద ఉంది.
భారత్‌లో 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్' (IBJA) గోల్డ్ రేటును నిర్ధారించే ప్రధాన సంస్థ. ఇందులో దేశంలోని అతిపెద్ద గోల్డ్ డీలర్స్ ఉంటారు. నిత్యం బంగారం ధరలను నిర్ణయించడానికి ఐబీజేఏ.. వీరితో కలిసి పనిచేస్తుంది. రేటును డీలర్ల కొనుగోలు, దిగుమతి పన్నులు, కరెన్సీ హెచ్చు తగ్గులు, స్థానిక పన్నులు వంటి వాటిని బేరీజు వేసుకుని నిర్ణయించడం జరుగుతుంది.
బంగారం రేటు పెరగడానికి కారణం
భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment