IBJA
-
భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
భారతదేశంలో బంగారంకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటు ఎలా పెరుగుతుంది? ధరలను ఎవరు నిర్ధారిస్తారు? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.బంగారం స్వచ్చతను బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. అవి 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్. నేడు (ఫిబ్రవరి 11) 22 క్యారెట్స్ 10 గ్రా ధర రూ. 80100, 24 క్యారెట్ తులం ధర రూ. 87380 వద్ద ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. 65540 వద్ద ఉంది.భారత్‌లో 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్' (IBJA) గోల్డ్ రేటును నిర్ధారించే ప్రధాన సంస్థ. ఇందులో దేశంలోని అతిపెద్ద గోల్డ్ డీలర్స్ ఉంటారు. నిత్యం బంగారం ధరలను నిర్ణయించడానికి ఐబీజేఏ.. వీరితో కలిసి పనిచేస్తుంది. రేటును డీలర్ల కొనుగోలు, దిగుమతి పన్నులు, కరెన్సీ హెచ్చు తగ్గులు, స్థానిక పన్నులు వంటి వాటిని బేరీజు వేసుకుని నిర్ణయించడం జరుగుతుంది.బంగారం రేటు పెరగడానికి కారణంభారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది. -
Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్‌కే బంగారం ధరలు!
భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఏ రోజు బంగారం ధర తగ్గుతుందో అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజు బంగారం ధర ఎంతుందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) సులువైన అవకాశం కల్పించింది. మిస్డ్ కాల్ ఇస్తే చాలు పసిడి కొనుగోలుదారులు ఏ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన 8955664433 మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఆ రోజు పసిడి ధరలు ఎస్సెమ్మెస్ రూపంలో వెంటనే మొబైల్‌కు వచ్చేస్తాయి. అలాగే ఐబీజేఏ అధికారిక వెబ్సైట్ కూడా సందర్శించవచ్చు. ఐబీజేఏ గురించి.. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) అనేది దేశంలోని పసిడి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన సంస్థ. 1919లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని బులియన్, జ్యువెలరీ అసోసియేషన్లకు దీన్ని అపెక్స్ అసోసియేషన్‌గా పరిగణిస్తారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్పటికి ఉన్న బంగారం ధరలను ప్రచురిస్తుంది. బంగారం ధరలు Gold Rates today: ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. దేశంలో ఈరోజు (అక్టోబర్ 25) సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,560 ఉండగా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,110 ఉంది. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. -
బంగారం ప్రియులకు భారీ శుభవార్త!
మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే శుభవార్త. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర రూ.400కి పైగా తగ్గింది. వచ్చే ఏడాది నాటికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించినట్లు పేర్కొన్న తర్వాత భారతదేశంలో బంగారం ధర భారీగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర సెప్టెంబర్ 23న 0.62 శాతం క్షీణించి రూ.46,383కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేటు పెంపును ప్రకటించడంతో బంగారం ధర పడిపోయింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!) ఇండియన్ బులియన్ జువెలరీ ప్రకారం నేడు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.400లు తగ్గడంతో రూ.46,468కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.42,934 నుంచి రూ.42,565కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.600లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.60,362కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,954లుగా ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.47,840ల నుంచి రూ.47,560కు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి. -
పసిడి పరుగులకు బ్రేక్!
ఏప్రిల్ 1 నుంచి ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,554 నుంచి రూ.46,375కు పడిపోయింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ42,643 నుంచి 42,480కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నగల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.43,400కి చేరింది. అలాగే స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,350కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.67,175 నుంచి రూ.66,854కు పడిపోయింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: మళ్లీ బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా? -
దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర
-
దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపిన బంగారం ధరలు క్రమంగా నేలచూపులు చూస్తున్నాయి. వారం రోజుల్లోనే బంగారం ధర పది గ్రాములకు 2వేల రూపాయలు తగ్గింది. దీపావళి పండుగ నాటికి పది గ్రాముల బంగారం ధర 24వేలకు దిగిరావచ్చని ఇండియన్ బులియన్ అండ్ జూయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,600లుగా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 41,250 వద్ద కొనసాగుతోంది. అలాగే రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని వారు అంటున్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.