ఏప్రిల్ 1 నుంచి ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,554 నుంచి రూ.46,375కు పడిపోయింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ42,643 నుంచి 42,480కు చేరుకుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నగల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.43,400కి చేరింది. అలాగే స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,350కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.67,175 నుంచి రూ.66,854కు పడిపోయింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment