యువత కోసమే ‘మిస్డ్ కాల్’..!
Published Mon, Jan 6 2014 1:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళంకల్చరల్, న్యూస్‌లైన్: యువత కోసమే మిస్డ్‌కాల్ సినిమా తీశామని నిర్మాత ఎస్.రమానాయుడు చెప్పారు. సిక్కోలు పట్టణంలో మిస్డ్‌కాల్ యూ నిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. షిర్డీసాయి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించామన్నారు. మంచి కథాంశంతో సినిమా సాగుతుందని, నలుగురు హీరో లు, 10 మంది హీరోయిన్లు ఉన్నారని చెప్పారు. హీరో అభినయ్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందన్నారు. పాటలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయని చెప్పారు. హీరోయిన్ చంద్రకళ మాట్లాడుతూ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందన్నారు. మరోహీరో వెంకట్ మాట్లాడుతూ చిన్నసినిమాలకు, మంచి సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉందన్నారు.
పైరసీని అరకట్టేందుకు ఏపీటీఎఫ్..
పైరసీని అరికట్టేందుకు ఎంటీ పైరసీ టాస్క్‌ఫోర్స్(ఏపీటీఎఫ్)ను త్వరలో ప్రా రంభిస్తున్నామని నిర్మాత రమానాయు డు చెప్పారు. అన్ని ప్రాంతాల నుంచి సభ్యులను నియమిస్తామని చెప్పారు. పోలీస్ ఆఫీసర్లను సైతం ఇందులో చేరుస్తామన్నారు. ఎక్కడైనా పెద్ద సెంటర్లలో పైరసీ సీడీలు ఉన్నట్లు తెలిసిన వెంటనే.. ఆ వ్యక్తి ఫోన్ ద్వారా తమకు సమాచారం ఇస్తే..పోలీసులకు దాడులు చేయిస్తామన్నారు. సభ్యులకు బహుమతులు అందజేస్తామన్నారు.
హీరో, హీరోయిన్ల సందడి
నరసన్నపేట రూరల్: రావాడ పేట శి వార్లలో మిస్డ్‌కాల్ హీరో అభి, హీరోయి న్ చంద్రకళ సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన వారు.. ఆ చిత్రంలోని కొన్నిపాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట పంచాయతీ ఉప సర్పంచ్ పొట్నూరు కృష్ణ ప్రసాద్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భుజంగరావు, పొట్నూరు శివ, పి.వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టార్ హంట్
ధర్మాన టీవీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ‘స్టార్ హంట్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మిస్డ్‌కాల్ యూనిట్ పలు డ్యాన్స్‌లతో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ధర్మాన టీవీఎస్ యజమాని ధర్మాన శశిధర్, విశాఖ బీసీ సంఘం అధ్యక్షుడు మల్లా సురేంద్ర, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement