ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణాలు తీశాడు | Man arrested for murdering girl | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణాలు తీశాడు

Published Thu, Mar 20 2014 1:27 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణాలు తీశాడు - Sakshi

ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణాలు తీశాడు

హైదరాబాద్ : హైదరాబాద్‌లో అదృశ్యమైన మైనర్‌ బాలిక, 3 నెలల తర్వాత ప్రకాశం జిల్లాలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వనస్థలిపురంలో నివసించే శిరీష, అదే ప్రాంతానికి వెంకటేష్‌ మాయమాటల్లో పడింది. అతడిని నమ్మి, ఇంట్లోంచి లక్షా 50వేల నగదు, 2 తులాల బంగారం, తీసుకుని వెళ్లిపోయింది. మొదట వీరిద్దరు మహేశ్వరం మాచేపల్లిలో రెండ్రోజులు గడిపారు. అయితే, పెళ్లి చేసుకోవాలంటూ శిరీష తీవ్ర ఒత్తిడి తేవడంతో .. గతంలోనే పెళ్లైన వెంకటేష్‌ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.

పెళ్లాడతానని నమ్మించి, ఆమెను మాలకొండ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు, అక్కడే ఆమె చున్నీని గొంతుకు బిగించి హత్య చేశాడు. శిరీష మృతదేహంపై ఆకులు కప్పి హైదరాబాద్‌ ఆ తర్వాత బెంగళూరుకు పారిపోయాడు. ఇటు కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో జనవరి 7న ఫిర్యాదు చేశారు.

అప్పట్నించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, వెంకటేష్‌ కోసం గాలించి, చివరికి బెంగళూరులో అరెస్ట్ చేశారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా ... కుళ్లిపోయిన ఎముకల గూడు కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement