state women commission
-
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యు లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, గద్దల పద్మ, కటారి రేవతీరావు కమిటీలో ఇతర సభ్యులు. కమిషన్ చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్లు పదవి లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రా ష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా త్రిపురాన వెంకట రత్నం పనిచేశారు. రాష్ట్ర వి భజన నేపథ్యంలో 2018 మార్చి వరకు ఆమె కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో మహి ళా కమిషన్‌కు చైర్పర్సన్ నియామకం జరగలేదు. దీంతో సుమారు నాలుగేళ్లుగా కమిషన్ క్రియాశీల కార్యకలాపాలకు దూరంగా ఉంది. ముగ్గురు సీఎంల కేబినెట్లో మంత్రిగా.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివ ర్గంలో చిన్న నీటి పారుదల, మహి ళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభ జన తర్వాత 2014, 2018లో నర్సాపూర్ శాసన సభ స్థానం నుంచి, 2015లో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. కమిటీ సభ్యులుగా నియమి తులైన గద్దల పద్మ ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. షహీనా అఫ్రోజ్ (మార్కె ట్ కమిటీ మాజీ చైర్పర్సన్), కొమ్ము ఉమాదేవి యాదవ్ (టీఆర్ఎస్ మహిళా కార్మిక విభాగం), సుధం లక్ష్మి (నిజా మాబాద్), రేవతీ రావు (కరీంనగర్) టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణకు కృషి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా తనను నియమించడంపై మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా తనను ఈ పదవిలో నియమించిన సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే.. ఏళ్ల తరబడి తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్.రమ్యారావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 18లోగా మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోవడం పై చీఫ్ జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా నియామకం జరగని పక్షంలో సీఎస్ కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ జనవరి 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్వధార్ హోమ్ బాధిత యువతులకు అండ..
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం ) : స్వధార్ హోమ్ బాధిత యువతులకు రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వధార్ హోమ్ బాధితులను ఆమె పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ పరిస్థితిని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు ఐసీడీఎస్ నుంచి ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఆర్థ్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించే విధంగా మహిళా కమిషన్ కృషి చేస్తుందన్నారు. బొమ్మురు మహిళా ప్రాంగణం స్వధార్ హోమ్ నుంచి తరలించిన యువతులను కందుకూరి వీరేశలింగం స్టేట్‌హోమ్‌లో ఉన్న వారిని మహిళా కమిషన్ సభ్యురాలు పరామర్శించారు. డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ కోమల, మహిళా ప్రాంగణం ఇన్చార్జ్ సీహెచ్‌వీ నరసమ్మ తదితరులు ఉన్నారు. -
పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు
సాక్షి, అమరావతి బ్యూరో/భవానీపురం(విజయవాడ పశ్చిమ) : బెజవాడలో ఆదివారం అదృశ్యమైన బాలిక పక్కింట్లోనే శవమై కనిపించింది. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పరిధిలోని నల్లగుంటలో ఈ దారుణం జరిగింది. ఏసుపాదం, రమణ దంపతుల కుమార్తె మొవ్వ ద్వారక(8) ఆదివారం అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు అదే రోజు రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటి పక్కనే ఉండే మర్లపూడి ప్రకాష్ భార్య సోమవారం ఊరి నుంచి వచ్చి ఇంటి తలుపులు తెరచి చూడగా ఒక మూటలో బాలిక శవం కనిపించింది. ఈ విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలిపింది. ఆగ్రహంతో స్థానికులు ప్రకాష్‌ను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. బాలిక తండ్రి ఓ లిక్కర్ షాపులో పనిచేస్తుండగా, తల్లి రమణ ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడబోగా కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను వదిలేది లేదు : వాసిరెడ్డి పద్మ బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాలిక ద్వారక కుటుంబీకులను ఆమె సోమవారం పరామర్శించారు. -
‘నా భర్త నాకు కావాలి’
రేగిడి: నా భర్త నాకు కావాలి.. నా జీవితం నా భర్తతోనే కొనసాగేటట్టు మీరంతా సహకరించాలి.. అలాకాకుంటే నాకు దిక్కులేదంటూ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు ధనలక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఎదుట వాపోయింది. కెంబూరు ధనలక్ష్మిది ఇదే మండలం కొర్లవలస గ్రామం. 2016 ఏప్రిల్‌లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరు వాసుదేవనాయుడుతో వివాహం జరిగింది. ఏడాదిపాటు సంసారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఈమెకు భర్తతో పాటు అత్తమామలు, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని ఈ నెల 22న రేగిడి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేసిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేశారు. ధనలక్ష్మి ఇంతటితో ఆగకుండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేసింది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ కొయ్యాన శ్రీవాణితో పాటు జిల్లా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వై.హిమబిందు, డీవీసీ కౌన్సిలర్ కె.నిర్మలతో పాటు రాజాం సీడీపీఓ కె.వసుందరాదేవి లక్ష్మీపురం గ్రామం గురువారం వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలు ధనలక్ష్మి కమిషన్ సభ్యులు ఎదుట తమ గోడును వెల్లబుచ్చారు. వివాహం చేసుకున్న తర్వాత తాను చాలా కష్టాలు అనుభవిస్తున్నానని, తనకు భర్త నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సంతోషం లేకుండా పోతుందని, తనను భర్త చక్కగా చూసుకుంటే జీవితాంతం హాయిగా ఉంటానని కన్నీటి పర్యంతమైంది. తర్వాత రాష్ట్ర కమిషన్ మెంబర్ శ్రీవాణి ధనలక్ష్మి అత్తమామల వాదన విన్నారు. ధనలక్ష్మి భర్త వాసుదేవనాయుడును పిలిపించాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో అందుబాటులో లేడని చెప్పారు. దీంతో ఈ విషయంపై శ్రీవాణి మాట్లాడుతూ అమ్మాయికి అవగాహన తక్కువ కావడంతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సరిపెట్టుకోవాలి. అమ్మాయిని వదిలించుకోవడానికే తప్ప భార్యాభర్తలను ఒక్కటి చేసేందుకు కుటుంబ సభ్యులు సహకరించడంలేదన్నది స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి భార్యాభర్తలను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని, ఇద్దరికీ నచ్చజెప్పి జీవితం సాఫీగా నడిచేలా చూస్తామన్నారు. వీరితో పాటు అంగన్వాడీ సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ తదితరులు ఉన్నారు. -
ఎన్నారై పెళ్లి సంబంధాలా.. జాగ్రత్త సుమా..!
► అన్ని అంశాలపై స్పష్టత వచ్చాకే పెళ్లి చేసుకోవాలి ► ‘ఎన్ఆర్ఐ పెళ్లిళ్లు–సమస్యలు’ అంశంపై సమావేశంలో నిపుణుల అభిప్రాయం హైదరాబాద్: ‘‘ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధమంటే గుడ్డిగా ముందుకెళ్లొద్దు. అబ్బాయి వ్యవహారశైలిని పూర్తిగా తెలుసుకోవాలి. వీసా మొదలు... పనిచేసే కంపెనీలో వైఖరి ఎలా ఉందనే అంశాన్ని ఆరా తీయాలి. స్పష్టత వచ్చాకే పెళ్లికి ఒప్పుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ సంబంధాలు బెడిసి కొడుతున్నాయి. అలా బలైన మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాం’’ అని మహిళా కమిషన్ సమావేశంలో సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ప్లాజా హోటల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అధ్యక్షతన ‘ఎన్ఆర్ఐ పెళ్లిళ్లు-సమస్యలు’ అంశంపై సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యులు కేశవరావు, పోలీసు ఉన్నతాధికారులు సౌమ్య మిశ్రా, స్వాతిలక్రా, సీనియర్ న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ పెళ్లిలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రొఫార్మాలో అబ్బాయి/అమ్మాయి పాస్‌పోర్టు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఇందుకు కమిషన్ తరపున లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే సరిపోతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఉమాపతి సూచించారు. ఎన్ఆర్ఐలతో పెళ్లి తర్వాత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. అయితే వారిపై కేసులు పెడితే విదేశాల్లో చెల్లడం లేదని, దీంతో వారిపై చర్యలు క్లిష్టతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తేనే ఫలితం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ చురుకుగా పనిచేయడం లేదని, కొత్త రాష్ట్రంలో కమిషన్ మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్జీఓలు అభిప్రాయపడ్డారు. మైనార్టీ కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీయులతో పెళ్లిళ్లకు అంగీకరిస్తున్నారని, దుబాయ్, అబుదాబీ, ఒమన్, సుడాన్ దేశాల్లో హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నట్లు సమావేశంలో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాలు జాతీయ కమిషన్‌కు సమర్పించనున్నట్లు కమిషన్ పేర్కొంది.