
ఎవరినీ వదలం: చంద్రబాబు
హైదరాబాద్: 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై 227 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 188 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. పలువురు నిందితుల పేర్లను చదివి వినిపించారు.
ఎవరినీ ఉపేక్షించబోమని, టీడీపీ పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రుణగ్రస్తుల ప్రయోజనాలు కాపాడానికి, నిందితులను కఠినంగా శిక్షించేవిధంగా చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై విచారణకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. బాధితులకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామన్నారు.