అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల | gorantla buchaiah chowdary speech in andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల

Published Sat, Dec 19 2015 1:28 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల - Sakshi

అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి రెచ్చిపోయారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఊగిపోయారు. సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాము కూడా సభను అడ్డుకోగలమని అన్నారు. విపక్ష సభ్యులను ఎలా దారికి తేవాలో తమకు తెలుసునన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసైనా సభ జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు.

'సభను అడ్డుకోవడం మాకు చేతనవును. మాకూ అధికారం ఉంది. మేము ఏమైనా చేయగలం. మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు. ఇక ముందు సభకు అడ్డుపడకుండా విపక్ష సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. వారిని సస్పెండ్ చేసైనా సభను నడపండి' అని గోరంట్ల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement