
'సమావేశాలు జరగనీయం'
హైదరాబాద్: 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణంలో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ అంశాలను తమ పార్టీ పార్లమెంట్ లో లేవనెత్తుతుందని తెలిపారు. ప్రభుత్వం సరైన స్పందన రాకుంటే సమావేశాలను జరగనీయబోమని హెచ్చరించారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ చొరవ చూపాలన్నారు. కేసీఆర్ తన భజనపరులకు చెప్పి చెత్తను తొలగించేలా స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని సూచించారు.