
జడ్చర్ల: ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంగళవారం కోమటిరెడ్డిని కలిసిన ప్పుడు.. తమ్ముడి కోసం రాజకీయ భవిష్యత్ ను ఎందుకు పణంగా పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పారు. మునుగోడు ఆడబిడ్డను అందరం కలిసి గెలిపించుకుందామని వెంకట్ రెడ్డికి నచ్చజెప్పానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment