swachh hyderabad
-
‘ఎలక్ట్రిక్’ ఎక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛహైదరాబాద్’లో భాగంగాజీహెచ్ఎంసీ చేపట్టినకార్యక్రమాల్లో ఎలక్ట్రిక్ కార్లు ఒకటి. పెట్రోలు, డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తే వాహన కాలుష్యం, ఇంధన వ్యయం తగ్గుతుందని, పర్యావరణ పరంగానూ మేలు చేకూరుతుందని జీహెచ్ఎంసీ భావించింది. తొలుత బల్దియా అధికారుల కోసంవినియోగిస్తున్న అద్దె కార్ల స్థానంలోనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో 20 మంది అధికారులకు అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ కార్లను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు ఏడాది క్రితం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, యూఎన్ఈపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ వాహనాలకు చరమగీతం పాడతామని, జీహెచ్ఎంసీలో దశలవారీగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. మలి దశలో చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు సైతం ఎలక్ట్రిక్‌వే వినియోగిస్తామని పేర్కొన్నారు. కానీ ఏడాదవుతున్నా ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి రాలేదు. ప్రారంభించిన ఆ కార్లు ఏమయ్యాయో తెలియదు. ఇక ఎలక్ట్రిక్ కార్లే వాడతారనే ప్రచారం జరగడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా జోన్లలోనూ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు ఎలక్ట్రిక్ కార్లే రాలేదు. అసలేం జరిగింది? జీహెచ్ఎంసీలో అధికారుల కోసం దాదాపు 350 అద్దె కార్లను వినియోగిస్తున్నారు. దశలవారీగా వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. తొలుత ఆరేళ్ల కాలానికి ఈఈఎస్ఎల్ నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకొని.. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒప్పందం పొడిగించుకోవాలని అనుకున్నారు. డ్రైవర్ వేతనం కాకుండా నెలకు ఒక్కో కారును రూ.22,500 అద్దెకు ఇచ్చేందుకు ఈఈఎస్ఎల్ అంగీకరించింది. జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్ల సేవల్ని వినియోగించుకోవాలనుకున్నారు. ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు రూ.11 లక్షలు. నెలనెలా జీహెచ్ఎంసీ చెల్లించే అద్దెనే ఈఎంఐగా కడితే కారునే కొనుక్కోవచ్చు. ఈఈఎస్ఎల్ సైతం జీహెచ్ఎంసీ ద్వారా లభించే అద్దెనే ఈఎంఐగా కట్టి రుణంపై కార్లు అందుబాటులోకి తేనుందని తెలుసుకున్న అధికారులు... రుణంగా తీసుకుంటే కారే జీహెచ్ఎంసీ సొంతమవుతుందని భావించారు. అయితే వాహనాల కొనుగోళ్లపై ప్రభుత్వ నిషేధం ఉంది. అద్దెకైతే ఎన్ని కార్లయినా తీసుకోవచ్చు గానీ... కొనడానికి జీహెచ్ఎంసీకి అవకాశం లేకపోవడంతో వీల్లేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ఈఈఎస్ఎల్తో జరిపిన సంప్రదింపులతో ఒప్పందం మేరకు ఆరేళ్ల అద్దె గడువు ముగిశాక అప్పటి పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని దాదాపు రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తే అద్దెకార్లను జీహెచ్ఎంసీ పరం చేసేందుకు ఈఈఎస్ఎల్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. చట్టపరంగానూ ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంది. వీటిపై వెంటనే శ్రద్ధ చూపితే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చి ఉండేవేమో. కానీ సంబంధిత అధికారులు ఈ అంశంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటి వరకు కార్యాచరణకు నోచుకోలేదు. కేటీఆర్ చేతుల మీదుగా జరిగిన ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభోత్సవం కేవలం ‘ఫొటో ఫినిష్’ కార్యక్రమంగా మిగిలిపోయింది. లక్ష్యం.. 2030 కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ తదితర సంప్రదాయ ఇంధన వాహనాల వినియోగాన్ని భవిష్యత్తులో రద్దు చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఇంధన, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కలిసి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలే రోడ్లపై తిరగాలనేది దీని లక్ష్యం. ప్రయోజనాలివీ... ♦ బ్యాటరీని 6–8 గంటల సమయంతో పూర్తిగా చార్జింగ్ చేయొచ్చు. ♦ ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 100–130 కి.మీ.ల వరకు ప్రయాణించొచ్చు. అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే ఏసీ చార్జర్ బదులు డీసీ చార్జర్ వినియోగిస్తే గంటన్నరలోనే చార్జింగ్ పూర్తవుతుంది. ♦ వీటితో వాయు, ధ్వని కాలుష్యం ఉండదు. కార్బన్ డయాక్సైడ్ వెలువడదు. ♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 పైసల విద్యుత్ ఖర్చవుతుంది. ♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం. -
అందమా అందుమా!
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ’ హైదరాబాద్ లక్ష్యం సాకారం కావడం లేదు. ప్రతిఏటా ‘స్వచ్ఛ’ కార్యక్రమాల అమలుకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ‘స్వచ్ఛ’ ర్యాంకింగ్‌ల సమయంలో కేంద్ర బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు... ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగరానికి స్వచ్ఛ ర్యాంకింగ్‌లు వస్తున్నాయి కానీ... నగరం మాత్రం స్వచ్ఛంగా మారడం లేదు. అనేక ప్రాంతాల్లో వీధులను ప్రతిరోజు ఊడ్వడం లేదు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించడం లేదు. దీన్ని నివారించేందుకు, హైదరాబాద్‌ను ‘స్వచ్ఛ’, అందమైన నగరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ మరో కార్యాచరణకు సిద్ధమైంది. ప్రతిఏటా ‘స్వచ్ఛ’ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలుస్తున్న ఇండోర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లనుంది. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల నిర్వహణకు అక్కడ అమలు చేస్తున్న ‘మైక్రో ప్లానింగ్’ను నగరంలో ప్రవేశ పెట్టనుంది. వంద రోజుల లక్ష్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఇంతలోపు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, రిహార్సల్స్ నిర్వహించడం తదితర చేయాలనిజీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీలో 18 వేలకు పైగా పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో రోజూ ఊడ్వడం లేదు. అనేక కాలనీలు, బస్తీల్లో వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఊడుస్తున్నారు. ఇక రోడ్ల పక్కన, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారాలను అలాగే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు నగరమంతా ఒకేసారి కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా తొలుత దీన్ని అమలు చేయనున్నారు. ఒక్కో వార్డులోని దాదాపు 2,500 ఇళ్ల పరిధి మేరకు ఇందుకు ఎంపిక చేస్తారు. గ్రేటర్‌లోని 150 వార్డులు ఉండగా.. వెరసి 3.75 లక్షల ఇళ్ల పరిధిలో దీన్ని అమలు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో తర్వాతి దశల్లో చేపడతారు. అయితే ఎంపిక చేసిన వాటిలో కచ్చితంగా మురికివాడలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై కాగితాలు లేకుండా రోజుకు రెండుసార్లు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం అమలులో స్వచ్ఛ ఆటోలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు, పర్యావేరణవేత్తలు, ఆయా రంగాల్లోని ప్రముఖులు, ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. వంద రోజుల లక్ష్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో ఏయే పనులు చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించారు. ఇంకేం చేస్తారు? ♦ ఎన్ఫోర్స్మెంట్ బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కాగితాలు రోడ్లపై వేయొద్దని దుకాణదారులకు సూచిస్తుంది. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు వసూలు చేస్తుంది. ♦ ఓడీఎఫ్ (ప్లస్ ప్లస్) అర్హత కొనసాగేందుకు అన్ని కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లను సక్రమంగా నిర్వహించడం. ♦ బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ మల విసర్జన ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం. ♦ ఎన్జీఓల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. ♦ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల సక్రమ నిర్వహణకు స్థానిక డిప్యూటీ కమిషనర్ వారానికి రెండుసార్లు, ఏఎంఓహెచ్‌లు వారానికి మూడుసార్లు తనిఖీలు చేసి ఇబ్బందులేమైనా ఉంటే పరిష్కరించాలి. ♦ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో పచ్చదనం పెంపొందించాలి. సుందరీకరణ పనులు చేపట్టాలి. ♦ ఉదయం 6గంటలకు ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఎలాంటి చెత్త కనిపించకూడదు. ♦ దెబ్బతిన్న రహదారులు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేయాలి. ♦ రోడ్లపై చెత్త, కాగితాలు, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలి. ♦ బహిరంగ మూత్ర విసర్జనకు జరిమానాలు వేయడం. భాగస్వాములు వీరు... ♦ సాధారణ ప్రజలు, విద్యార్థులు, దుకాణాదారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీఓలు, కార్మికులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సీనియర్ సిటిజెన్స్, మతపెద్దలు. ♦ ఇక అధికారులు, సిబ్బంది విషయాని వస్తే కమిషనర్, అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, స్వచ్ఛ భారత్ మిషన్, రవాణా విభాగం, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయ విభాగం, వెటర్నరీ వింగ్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, యూసీడీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ జవాన్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్, స్వీపర్లు, చెత్త సేకరణ సిబ్బంది. చేయాల్సిన పనులివీ... ♦ ఇళ్ల నుంచి చెత్తను తరలించే స్వచ్ఛ ఆటోల రూట్ మ్యాప్. అవి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పని చేస్తున్నాయో తెలుసుకోవాలి. ♦ స్వచ్ఛ ఆటోలను నడిపే వారికి కేటాయించిన 600 ఇళ్లలో కనీసం 10శాతం ప్రజల నుంచి సీఆర్పీలు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ♦ ఈ ఫీడ్‌బ్యాక్‌పై ఎన్జీఓ కార్యకర్తతో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇందుకుగాను కనీసం 5శాతం ఇళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అనంతరం ఏఎంఓహెచ్ ర్యాండమ్‌గా పరిశీలించాలి. ♦ స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ రెండు ట్రిప్పులు పని చేయాలి. ♦ ఇళ్ల యజమానులు ఎవరైనా స్వచ్ఛ ఆటోలకు డబ్బులు ఇవ్వకుంటే అవగాహన కల్పించాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు, చెట్ల కొమ్మలు వేసే ప్రాంతాలు గుర్తించి సాయంత్రం వాటిని తొలగించాలి. తిరిగి అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలి. ♦ ప్రతి స్వచ్ఛ ఆటో కనీసం 600 ఇళ్ల నుంచి చెత్త సేకరించాలి. ♦ ఎంపిక చేసిన ప్రాంతంలోని వీధులను పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శుభ్రం చేయాలి. డ్రైనేజీ పొంగిపొర్లకుండా చూడాలి. చెత్త కాల్చివేయడం లాంటి పనులు చేయకుండా చూడాలి. ♦ కమ్యూనిటీ డస్ట్బిన్ల చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూడాలి. వాటి నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలి. క్రమేపీ చెత్త డబ్బాలనేవి లేకుండా చేయాలి. ♦ బిన్ ఫ్రీ, డస్ట్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దాలి. దీన్ని నిరంతరం కొనసాగించాలి. ఏ పని? ఎన్ని రోజులు? ♦ 15 రోజుల్లోగా అన్ని కాలనీలు, బస్తీలకు స్వచ్ఛ ఆటోలు వెళ్లేలా చూడాలి. ♦ 30 రోజుల్లోగా ఇంటింటి చెత్త సేకరణ వందశాతం పూర్తి చేయాలి. ♦ 90 రోజుల్లోగా తడి, పొడి చెత్తను వేరు చేయడం వందశాతం పూర్తి చేయాలి. ♦ 30 రోజుల్లోగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు తదితర లేకుండా చూడాలి. ♦ 60 రోజుల్లోగా కాలనీ పార్కులు, అధిక మొత్తంలో చెత్త వెలువడే ప్రాంతాల్లో కంపోస్టు తయారీ. ♦ 30 రోజుల్లోగా అధిక మొత్తంలో చెత్త వెలువడే ప్రాంతాల నుంచి సేకరణ ఏర్పాట్లు. ♦ 15 రోజుల్లోగా రోడ్లను ఊడ్వడమే కాకుండా కాగితాలు లేకుండా చేయాలి. ♦ 45 రోజుల్లోగా ఓడీఎఫ్ పటిష్టంగా అమలు చేయడం. ♦ 15 రోజుల్లోగా వాణిజ్య ప్రాంతాల్లో సాయంత్రం రోడ్లు ఊడ్వడం, చెత్త సేకరణ చేపట్టడం. ♦ 60 రోజుల్లోగా చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణ మెరుగు పరచడం. ♦ 30 రోజుల్లోగా హాట్‌స్పాట్ మేనేజ్మెంట్. ♦ 15 రోజుల్లోగా బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు, 30 రోజుల్లోగా ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు. పైన పేర్కొన్న నిర్ణీత వ్యవధుల్లో ఆయా లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు వాటిని నిరంతరం కొనసాగించాలి. ఈ క్రతువులో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, ఎన్జీఓలు, పారిశుధ్య గ్రూపుల సభ్యులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వచ్ఛ ఆటోలు భాగస్వామ్యం కావాలి. వీరందరూ యూనిఫామ్స్ ధరించాల్సి ఉంటుంది. -
పారిశుధ్యమా నీవెక్కడ..?
ఎక్కడ చూసినా ‘చెత్త’ గుట్టలే. ఏ రహదారినా వెళ్లినా ముక్కుపుటలదిరే దుర్వాసనే. చెత్త డంపింగ్‌కు కాదేదీ అనర్హం.. అన్నట్టు మహానగరమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. పారిశుధ్యం పడకేసి.. చారిత్రక భాగ్యనగరి.. పరమ ‘చెత్త’గా మారుతోంది. ఎందుకీ దుస్థితి..? దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కాదా.? అవును ముమ్మాటికీ వారిదే ఈ మూల్యం. గ్రేటర్ ఎన్నికల వేళ మహానగరి మహాసమస్య మళ్లీ ముందుకొచ్చింది. వాగ్దానాల వాగ్బాణాలను ‘చెత్త’ బుట్టలో వేసే నాయకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చెత్త’ను కడిగేసే ‘స్వచ్ఛ’మైన హామీలిచ్చే నాయకుడికే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అంబర్‌పేట 4 వేల టన్నులు.. ప్రతిరోజు గ్రేటర్లో పోగవుతున్న చెత్త. ఇదీ జీహెచ్ఎంసీ అధికారుల లెక్క. కానీ అసలు లెక్క వేరు. లెక్కకు మిక్కిలి చెత్త నగరంలో పోగవుతోంది. పారిశుధ్యం పడకేసి అదంతా రోడ్లపైనే దర్శనమిస్తోంది. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డంపర్బిన్లు నిండిపోయి చెత్త చెల్లాచెదురవుతోంది. ఫలితంగా దుర్వాసన వెదజల్లి, దోమలు వృద్ధి చెంది ప్రజలకు ప్రాణాంతక వ్యాధులొస్తున్నాయి. సాధారణ చెత్తకు ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తోడవుతుండడంతో ఇది మరింత ఎక్కువవుతోంది. ‘స్వచ్ఛ’తకు స్వస్తి..! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు అందరూ రోడ్లెక్కి చెత్తను ఊడ్చి ఫొటోలకు ఫోజులిచ్చేశారు. సీఎం పార్శీగుట్ట డివిజన్‌ను దత్తత తీసుకోగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కో డివిజన్‌కు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఎక్కడ ‘చెత్త’ అక్కడే ఉండిపోతోంది. కారణం పథకం అమలులో అలసత్వం. నిర్వహణ లోపం. ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభమై 8 నెలలు అవుతోంది. నెలనెలా జరగాల్సిన ఈ కార్యక్రమం కేవలం తొలి రెండు పర్యాయాలు మాత్రమే జరిగిందంటే పరిస్థితి అర్థమవుతోంది. దీంతో పథకం ‘ఆరంభ శూరత్వం’గానే మారిందనే విమర్శలున్నాయి. మరోవైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో చేసిన పనులకు ఎనిమిదినెలలైనా ఇంకా బిల్లులు చెల్లించలేదని వాహనాలు అద్దెకిచ్చిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. నిర్వహణ లోపమే అసలు సమస్య..! నగరంలో 8 వేల కిలోమీటర్ల రహదారులుండగా.. కేవలం 2 వేల కి.మీ పరిధిలో మాత్రమే పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడానికి ఇదే అసలు సమస్య. దీనికి తోడు కార్మికులు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపర్‌బిన్లలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు పూర్తిగా చెత్త మయమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో డంపర్బిన్లు లేక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. సమస్యలిలా.. ‘స్వచ్ఛ’తెలా..? * చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు 564 వాహనాలు ఉన్నాయి. చెత్త తరలింపునకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలోనూ 458 మాత్రమే జీహెచ్‌ఎంసీవి. మిగతా 106 అద్దె వాహనాలు. వాహనాల్లోనూ సగం తుప్పు పట్టడంతో మరమ్మతులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. * పారిశుధ్య కార్మికులు గ్రూపులో ఏడుగురు ఉండాలి. కానీ నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది పేర్లు హాజరుపట్టిలో ఉంటాయి. కానీ మనుషులుండరు. ఇలా సుమారు 5 వేల మంది జీతాలు కొందరి అక్రమార్కుల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. వీటిని పంచకుంటున్న వారిలో శానిటరీ సూపర్వైజర్లలు ఇతర సిబ్బంది, యూనియన్ల నేతలు కూడా ఉండడం గమనార్హం. నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రారంభించిన ‘పరిచయం’ కార్యక్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. అవినీతి ఇంత బహిరంగంగా జరుగుతుంటే.. ఇక పారిశుధ్యం ఎప్పటికి బాగుపడుతుంది.? * నగరంలో రోజుకు వందల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. నిజం చెప్పాలంటే గ్రేటర్ చెత్తలో ఇదే సగం. ప్లాస్టిక్ నిషేధించాలనే ప్రయత్నాలన్నీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఒత్తిడితో నీరుగారిపోయాయి. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించినా అమలు లేదు. కొన్నాళ్లు అమలు చేసి తర్వాత చేతులెత్తేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే చెత్త సమస్యకు చెక్ చెప్పొచ్చు. ఇప్పటికే పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. * ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వ్యర్థాలు) వెన్నంటే వెంటాడుతోంది. ఈ-వ్యర్థాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత స్థానం హైదరాబాద్‌దే. గ్రేటర్లో ఏటా సుమారు 45 వేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగవుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్ల చెత్తే 12 వేల టన్నులు ఉందని ఈటీ పీఆర్ఐ సర్వేలో తేలింది. వీటిలో 55 శాతం సాధారణ చెత్తతో కలుస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. * వీటన్నింటితో పాటే బయోమెడి‘కిల్’ వేస్ట్ గ్రేటర్‌ను కలవరపెడుతోంది. ఆస్పత్రుల నుంచి వెలువడే ఈ డేంజర్ వేస్ట్‌ను సాధారణ చెత్తతో రోడ్లపైనే తగలబెడుతున్నారు. దీంతో 20 శాతం జనాభా అంటువ్యాధుల బారిన పడుతున్నారని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో ఏడాదికి 18 వేల టన్నుల బయోమెడి‘కిల్’ వ్యర్థాలు వెలువడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కల్లో తేలింది. నగరంలో ప్రతిరోజు 50 టన్నుల బయోమెడికల్ వేస్ట్ పరిసరాల్లో కలుస్తోంది. ఏదీ ‘చెత్త’ శుద్ధి..? సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించడం లేదు. రోడ్లపైనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. జీడిమెట్ల నాలా పక్కన ఎన్నో ఏళ్ల నుంచి చెత్త డంప్ చేస్తున్నారు. గతంలో అధికారులు వచ్చి చూసి వెళ్లినా ఇంత వరకు చెత్తను తరలించలేదు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలి. ఆ దిశగా కృషి చేసే నాయకులకే నా ఓటు. - సంతోష్, ఆటోడ్రైవర్, జయరాంనగర్ చెత్తతో నిత్యం కుస్తీలే.. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక రోడ్లపై చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. చెత్త తరలింపునకు పాలకులు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం అమలు లేక అటకెక్కింది. గ్రేటర్ బరిలో నిలిచే పార్టీలు చెత్త నిర్వహణకు సరైన ప్రణాళికలతో ముందుకు రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించే పార్టీకే నా ఓటు. - సిరాజుద్దీన్, అంబర్‌పేట -
హామీలే... ఏమీలే
- పేరుకే ‘స్వచ్ఛ హైదరాబాద్’ కమిటీలు - అమలుకు నోచని సిఫారసులు - ఎక్కడి సమస్యలు అక్కడే - అన్ని విభాగాలదీ ఒకటే తీరు సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’తో విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమస్యలను గుర్తించడం... వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు వెల్లడించింది. కానీ అధిక శాతం సమస్యలది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న తీరే. ప్రభుత్వ పెద్దల హామీలలో అనేకం కాగితాల మీద నుంచి కిందకు దిగలేదు. గతమే నెలలో నిర్వహించిన తొలి విడత ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఫిర్యాదులను, ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని జూన్‌లో అన్ని పార్టీల నేతలతో ‘స్వచ్ఛ కమిటీలను’ నియమించారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్ఎండీఏ, విద్యుత్ విభాగాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. సమస్యల పరిష్కారానికి ఇవి కొన్ని సిఫారసులు చేశాయి. వీటికి రూ.200 కోట్లు మంజూరు చేశారు. విభాగాల వారీగా ఎవరేం పనులు చేయాలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి సంబంధించి పనులను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో స్వల్పకాలిక పనులు ముందంజలో ఉన్నాయి. మిగతా విభాగాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ కొంత ముందంజలో ఉందనే చెప్పాలి. సిఫారసులు.. అమలు తీరు - ఇంటింటి నుంచి చెత్త సేకరణకు అదనంగా వెయ్యి రిక్షాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. - ఇంకా కొనలేదు. - చెత్త తరలింపునకు 2500 ఆటో టిప్పర్ల కొనుగోలుకు నిర్ణయం. - పనులు పురోగతిలో ఉన్నాయి. ఆటో టిప్పర్ల ఎంపిక పూర్తయింది. వీటిని డ్రైవర్ కమ్ ఓనర్ తరహాలో లబ్ధిదారులకు అందజేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. - చెత్త తరలించేందుకు పాత వాటి స్థానే కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు నిర్ణయం. - వీటిపై కదలిక లేదు. - చెత్త నుంచి విద్యుత్ తయారీకి నగరానికి నాలుగు వైపులా 4 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. - బీబీనగర్ సమీపంలోని ఆర్డీఎఫ్ ప్లాంట్, జవహర్ నగర్ ప్లాంట్లను పరిశీలించారు. - పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని సిఫారసు. మెరుగైన వైద్య సౌకర్యాలు, గృహ సౌకర్యం కల్పించాలని యోచన. - వేతనాలను రూ.8,500 నుంచి రూ.12,500కు పెంచారు. గృహాల కోసం స్థలాలు అన్వేషిస్తున్నారు. వైద్య సదుపాయంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. - జవాబుదారీతనానికి ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలులోకితేవాలని నిర్ణయం. - ఇందులో భాగంగా హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని ఒక సర్కిల్లో ప్రారంభించారు. మిగతా సర్కిళ్లలోనూ త్వరలో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. - 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ నిషేధానికి నిర్ణయం. ఇందులో భాగంగా ప్లాస్టిక్ పరిశ్రమల తనిఖీకి నిర్ణయం. - కానీ ఇంతవరకు తనిఖీలు జరగలేదు. - పీపీపీ విధానంలో డెబ్రిస్ తరలింపునకు నిర్ణయం. - టెండర్లు పిలిచారు. త్వరలో ఖరారు కానున్నాయి. - డెబ్రిస్ తరలింపునకు శివార్లలోని మైనింగ్ ప్రదేశాలను గుర్తించాలని నిర్ణయించారు. - ఎంతవరకొచ్చిందో తెలియదు. - అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ల అమలుకు నిర్ణయం. - ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీని సూచనల మేరకు చర్యలు తీసుకుంటారు. - భవన నిర్మాణ అనుమతులకు పారదర్శక విధానాలు అమల్లోకి తేవాలని.. ప్రస్తుత విధానాలను సరళీకరించాలని నిర్ణయించారు. - ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇంకా అందుబాటులోకి రాలేదు. - నాలాల ఆధునీకరణ కోసం ఇళ్లు కోల్పోయే వారికి ప్యాకేజీ అందజేయాలని నిర్ణయించారు. - ప్యాకేజీని ఇంకా ప్రకటించలేదు. - నాలాల మార్గాల్లో బాటిల్‌నెక్స్ గుర్తించి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రాధాన్యం మేరకు పనులు చేయాలని నిర్ణయించినప్పటికీ.. మొదలు కాలేదు. దీనికి రూ.223 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. - చెత్త, వ్యర్థాలు వేయకుండా అన్ని మేజర్ నాలాల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. - పనులు పూర్తి కాలేదు. - దెబ్బతిన్న రోడ్లన్నీ వెంటనే రీకార్పెట్ చేయాలని సిఫార్సు చేశారు. - కానీ చాలా ప్రాంతాల్లో రోడ్లు పరమ అధ్వానంగా ఉన్నాయి. - ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం - ఏఈఈల నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్నోటిఫికేషన్ జారీ అయింది. - విద్యుత్ ఖర్చుల తగ్గింపునకు ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం - ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. - ఎస్సార్డీపీ ద్వారా రూ.20 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మించాలని సూచన. -
'చెత్త హైదరాబాద్ చేస్తున్నారు'
-
'సమావేశాలు జరగనీయం'
హైదరాబాద్: 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణంలో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ అంశాలను తమ పార్టీ పార్లమెంట్ లో లేవనెత్తుతుందని తెలిపారు. ప్రభుత్వం సరైన స్పందన రాకుంటే సమావేశాలను జరగనీయబోమని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ చొరవ చూపాలన్నారు. కేసీఆర్ తన భజనపరులకు చెప్పి చెత్తను తొలగించేలా స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని సూచించారు. -
మాటలే..చేతల్లేవ్
- గ్రేటర్ ఎన్నికల కోసమే స్వచ్ఛ హైదరాబాద్.... - టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు అధ్వానం - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం ఆర్కేపురం: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి స్వచ్ఛహైదరాబాద్ పేరుతో తమ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం ఆర్కేపురంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు సెటిలర్లను, సినిమా వాళ్లను ఇష్టమొచ్చినట్లు తిట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, తెలంగాణ తెచ్చింది తామేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెటిలర్లకు రక్షణగా ఉంటుందని అన్నారు. ముస్లింల ఓట్ల కోసం 12 శాతం రిజర్వేషన్ చేస్తామన్నారని, ఇంత వరకు దాని ఊసెత్తలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందన్నారు. ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, పీవీ నర్సింహారావు హైవే, ఔటర్ రింగురోడ్డు, కృష్ణా నీటి మూడవ ఫేజ్ పైపులైన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు టి.నాగయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, బండి నర్సింహాగౌడ్, కార్తీక్‌రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జంగారెడ్డి, హనుమంత్‌రెడ్డి, సాంబయాదవ్, లావణ్య, ఎస్.సుధీర్‌రెడ్డి, పున్న గణేష్, మహేందర్‌యాదవ్, సాజీద్, కొండల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీలక్ష్మి, దేవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్‌తోపాటు ఇతర నాయకులు ఘనంగా సత్కరించారు. -
అపరిశుభ్రతపై జీహెచ్ఎంసీ కొరడా
- కేఎఫ్‌సీకి జరిమానా - సెప్టిక్ ట్యాంకర్ల సీజ్ - స్వచ్చ హైదరాబాద్‌కు చర్యలు సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై చెత్తా చెదారం, వ్యర్థాలను పడవేసే వారి పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లో హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్న కేఎఫ్‌సీతో పాటు ఉప్పల్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా వాహనాలపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏకంగా కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ‘కేఎఫ్‌సీ’ రెస్టారెంట్ వారు గత కొంతకాలంగా హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్గంధమయం అయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల క్రితం హోటల్ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు. అయినా కేఎఫ్‌సీ సిబ్బంది ‘మా యాజమాన్యానికి చెబుతాం’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అధికారులు కేసు నమోదు చేసి రూ. 10 వేల రూపాయలు జరిమానా విధించారు. ఉప్పల్‌లో ట్యాంక్‌లు సీజ్ సెప్టిక్ ట్యాంక్‌లో తీసుకొచ్చిన వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు.నగరంలోని రామంతాపూర్ మోడ్రన్ బేకరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను మ్యాన్‌హోల్‌లో వదులుతుండగా అటుగా వెళ్తున్న ఈస్ట్ జోనల్ కమిషనర్ గమనించారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సెప్టిక్ ట్యాంక్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం కూడా అదే విధంగా మరో వ్యక్తి వ్యర్థాలను వదులుతుండగా గమనించిన మెడికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ రావు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకొని తాళం చెవులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేలోగా మరో తాళం చెవితో వాహనాన్ని తీసుకొని ట్యాంకర్దారుడు ఉడాయించారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసు నమోదుచేసి పరారీలో ఉన్న వాహన యజమాని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
చర్లపల్లి జైల్లో స్వచ్ఛ హైదరాబాద్
కుషాయిగూడ (హైదరాబాద్) : చర్లపల్లి సెంట్రల్ జైల్లో శనివారం ఉదయం 'స్వఛ్చ హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జైలు ఆవరణ, క్వార్టర్స్‌లో నెలకొన్న చెత్తా, చెదారం, పిచ్చి, మొక్కలను తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు రోగాలు మన దరికి చేరవని జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. -
'స్వచ్ఛ హైదరాబాద్'లో మంత్రులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి పద్మారావులు సుడిగాలి పర్యటనలు చేశారు. జీహెచ్ఎమ్సీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
పలుగుపార పట్టిన రౌడీలు
-
మాటలు బంద్.. ఇక పనులు చేద్దాం
* సమస్యల పరిష్కారానికి రాజకీయాలకతీతంగా పనిచేద్దాం.. * అందుకు ఇదే తొలి అడుగు కావాలి * ‘స్వచ్ఛ హైదరాబాద్’ సమీక్షలో ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాలా నీళ్లలోనే నిర్మాణాలు.. అధ్వానంగా పారిశుద్ధ్యం.. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు.. ఇళ్ల పైనుంచే హైటెన్షన్ వైర్లు.. ఇలా సమస్యలతో నగరం అల్లాడుతోంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే బాగుచే ద్దామన్నా చేసుకోలేని దుస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తపడాలి. ఇక మాటలు బంద్.. పనులు జరగాలి. ఎంత డబ్బు అవసరమైనా ఇస్తాం. రాజకీయాలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పనులు పర్యవేక్షించాలి. అందరం నగర సమస్యల పరిష్కారం కోసం కలసి పనిచేద్దాం. అందుకు ఇదే తొలి అడుగు కావాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగిన ‘స్వచ్ఛ హైదరాబాద్’లో వచ్చిన ప్రజాసమస్యలు, తదితరమైన వాటిపై గ్రేటర్‌లోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో సీఎం మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్ డీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు. గ్రేటర్లో పారిశుధ్యం పరిస్థితి బాగాలేదని, రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోందని, దీన్ని బయటకుపంపించేందుకు, నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు లేవని, అందరం కలసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. నగరానికి నాలుగువైపులా 50 కిలోమీటర్ల అవతల డంప్‌యార్డులు ఏర్పాటు చేద్దామన్నారు. ఢిల్లీ, నాగపూర్‌లో ఘనవ్యర్థాల నిర్వహణకు అవలంభిస్తున్న పద్ధతుల్ని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని నిర్ణయించారు. మంచిగా తీర్చిదిద్దుకుందాం.. మన హైదరాబాద్ నగరాన్ని మనమే మంచిగా తీర్చిదిద్దుకుందామని సీఎం కేసీఆర్ సూచించారు. బస్తీల్లోని హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగిస్తామని, పాతబస్తీలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి మూడు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 390 కిలోమీటర్ల పొడవున 72 నాలాల పరిస్థితి బాగులేదని, నాలాలపైనే కాక నాలా నీళ్లలో సైతం కట్టడాలు వెలిశాయని, వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నాలాలు, హైటెన్షన్ వైర్ల దుస్థితి, చెత్త తరలింపు, శిథిలాల తొలగింపు తదితర అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని, జూపల్లి, తలసాని, పద్మారావుగౌడ్‌తో పాటు గ్రేటర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వాలి: సీఎం గ్రేటర్ పరిధిలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించాలని, మురుగునీటి పారుదల వ్యవస్థ వంద శాతం మెరుగుపడాలని, కలుషిత జలాల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నగరంలో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలపై విపక్ష ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు. నగరానికి నిత్యం 602 మిలియన్ గ్యాలన్ల జలాలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 385 ఎంజీడీల జలాలే సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు సీఎంకు తెలిపారు. నగరంలో 20 లక్షల ఇళ్లుంటే 14 లక్షల కుటుంబాలకే నల్లాల ద్వారా మంచినీరు అందుతోందని వివరించారు. శివారు కాలనీలు, బస్తీలకు మంచినీరు అందించేందుకు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నీటి పథకాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నాలాలపై ఆక్రమణల నిరోధం, మురుగునీటితో నిండిన నాలాల గుర్తింపు, స్థానికుల అవస్థలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలిపై ఏర్పాటు చేసే సబ్‌కమిటీలు జూన్ 8లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలకు కమిటీలు వేసే బాధ్యతను అప్పగించారు. -
‘మహా’ మేలు!
- ‘స్వచ్ఛ హైదరాబాద్’తో శివారుకు మహర్దశ - అభివృద్ధి పనులకు సన్నాహాలు - మౌలిక వసతుల వైపు అడుగులు - అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో రూ.123 కోట్ల పనులు సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ పుణ్యమా అని గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలకు రూ.100 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో రూ.10 కోట్లలోపు పనులు జరగనున్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో శివారులోని నాలుగు నియోజకవర్గాల నుంచి రూ.వంద కోట్లకు పైగా ఖర్చయ్యే వినతులు అందాయి. కోర్‌సిటీలోని కొన్ని నియోజకవర్గాల నుంచి రూ.పది కోట్లలోపు వ్యయమయ్యే విజ్ఞప్తులు అందాయి. ఆమేరకు అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.వంద కోట్లకు పైగా పనులు ప్రతిపాదించిన నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి పనులకు దాదాపు రూ.123 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి (రూ.108 కోట్లు), ఎల్బీ నగర్ (రూ.107 కోట్లు), కూకట్పల్లి (రూ.100 కోట్లు) ఉన్నాయి. రూ.పది కోట్లలోపు ప్రతిపాదనల్లో కంటోన్మెంట్, యాకుత్‌పురా, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. నిధులెలా తెస్తారో? ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సిద్ధమయ్యాయి. వినతులు అందుకు మూడు రెట్లకు పైగా ఉన్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా బస్తీలకు నేతృత్వం వహించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల విజ్ఞప్తులను జీహెచ్ఎంసీకి నివేదించారు. వీటికి రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కేవలం పారిశుద్ధ్య కార్యక్రమంగా మిగలరాదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనిదే దానికి సార్థకత లేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులు విభాగాలు, యూనిట్ల వారీగా పనులను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ నెల 26న గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమీక్షించి పనులు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ నిధులు రూ.200 కోట్లతో వెంటనే పనులు చేపట్టేందుకు ఇబ్బంది లేనప్పటికీ, మిగతా రూ. 500 కోట్లు బాండ్ల ద్వారా సేకరిస్తారా.. ప్రభుత్వం కేటాయిస్తుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. -
కానరాని ‘స్వచ్ఛ'
- రోడ్లపై కుప్పలుగా సీజ్ చేసిన వాహనాలు - దారి లేక ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని కూకట్పల్లి పోలీసులు కూకట్పల్లి: ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం నిర్వహించింది. అయితే, కూకట్పల్లి పోలీసులు మాత్రం తమ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను గాలికొదిలేసి.. కేవలం జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దత్తత తీసుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను స్టేషన్‌కు నాలుగువైపులా రోడ్లపక్కన కుప్పలు కుప్పలుగా పడేసి ఈ మార్గంలో వెళ్లేవారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టేషన్‌కు ఒక వైపు ప్రభుత్వ పాఠశాల, ఎంఈఓ కార్యాలయం, మరోవైపు జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ వార్డుకార్యాలయం, ఈసేవ భవనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు రోడ్డుపై వెళ్లేందుకు దారిలేక ఇబ్బంది పడతున్నారు. అలాగే, పోలీసుస్టేషన్ వద్ద రోడ్లపై పార్క్ చేసిన వాహనాల కారణంగా తమకు ఇబ్బందిగా ఉందని స్థానిక వ్యాపారులు, గ్రామంలోకి వెళ్లేందుకు దారిలేదని కూకట్పల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, వెంటనే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తాజాగా కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు స్వచ్ఛ హైదరాబాద్ ప్యాట్రన్‌గా వచ్చిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌కు వినతిపత్రం ఇవ్వడం గమనార్హం. -
‘స్వచ్ఛ హైదరాబాద్’ ఇక నిత్యం!
-
సీఎం వరాలజల్లు
- బస్తీవాసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు - ఎర్రకుంట శ్మశానవాటిక అభివృద్ధికి రూ.2కోట్లు - ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తామని హామీ దిల్సుఖ్నగర్/సైదాబాద్: ‘స్వచ్ఛ హైదారాబాద్’ కార్యక్రమంలో చివరిరోజైన బుధవారం మలక్‌పేట్/మహేశ్వరంజోన్ ప్రజల్లో ఆనందం నింపింది. సీఎం కేసీఆర్ వరాల జల్లుతో ప్రాంతంలోని బస్తీలు, కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం రాకతో బస్తీలు కళకళలాడాయి. పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇవ్వడంతో బస్తీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జోన్ పరిధిలోని చావణీ డివిజన్లోని పిల్లిగుడిసెలు, సైదాబాద్‌లోని ఎర్రగుంట శ్మశానవాటిక, సరూర్‌నగర్‌లో రైతుబజార్ వెనక ఉన్న వీఎంహోంకు చెందిన ఖాళీస్థలం, ఎన్టీఆర్నగర్ రైతుబజారులను సందర్శించి ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్నగర్ బస్తీలో సీఎం కేసీర్ పర్యటించారు. వచ్చే ఐదు నెలల్లో బస్తీవాసులకు అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం, ఎర్రగుంట శ్మశానవాటికలో రూ, 2కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతానని సీఎం హామీ ఇచ్చారు. స్థానికులతో కలిసిపోయి ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం అకస్మిక పర్యటనతో షాక్‌తిన్న అధికారులు సీఎం పర్యటనలో ఎన్టీఆర్నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ మాత్రమే ఉంది. కానీ సీఎం సభ వరకు వచ్చి మళ్లీ వెనుదిరిగి బస్తీలోని బంజార కాలనీలోకి నేరుగా వెళ్లిపోవడంతో అందరూ కంగారు పడ్డారు. అకస్మిక తనిఖీతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సీఎం వచ్చే ప్రాంతం మొత్తం అద్దంలా తీర్చిదిద్దిన అధికారులు సీఎం రూట్‌మ్యాప్‌లో ఈ కాలనీ లేకపోవడంతో బస్తీని పట్టించుకోలేదు. దీంతో ఆ కాలనీలో రోడ్డుపై డ్రైనేజీ పొంగిపొర్లుతుండటం చూసిన సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు వినతుల వెల్లువ స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా జోన్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌కు స్థానికుల నుంచి వినతుల కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎర్రకుంటను మిషన్ కాకతీయలో చేర్చి అభివృద్ధి చేయాలని పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వాణినగర్, లక్ష్మినగర్, పూర్ణోదయకాలనీలలో లోఫ్రెషర్‌తో తాగునీరు సరఫరా అవుతోందన్నారు. ఇక్కడ కొత్త వాటర్ పైపులైన్ వేసి లోఫ్రెషర్ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. రౌద్రి సొసైటీ, ఇండిస్ట్రీయల్ సొసైటీ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పక్కా ఇళ్లు నిర్మిం చి, సొసైటీ వారికి జిల్లాలో భూములివ్వాలని సీఎంను కోరారు. సైదాబాద్ హనుమాన్ దేవాలయం వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని క్రీడా స్థలంగా అభివృద్ధి చేయాలని మాజీ వార్డు సభ్యుడు మదన్మోహన్ సీఎంను కోరారు. -
ముగిసిన స్వచ్ఛ హైదరాబాద్
హైదరాబాద్: నాలుగు రోజుల పాటు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, సినీ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు 2 లక్షల మంది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో 36 మంది జీహెచ్ ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కాలనీల్లో రూ. 6 వందల కోట్ల పనులకు ప్రతిపాదనలు అందాయని ప్రకటించారు. 32 వేల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించినట్టు చెప్పారు. -
ఆ పెద్ద మనిషి ఏ చీకట్లో ఉన్నాడో..?
నల్లకుంట (హైదరాబాద్) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కరెంట్ లేక అంధకారంగా మారుతుందని అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏ చీకట్లో ఉన్నాడో.. కనబడడంలేదని... స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగుల్లో ఉందంటూ ఆయన... మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం న్యూ నల్లకుంట నరేంద్ర పార్క్‌లో పార్క్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. పార్క్ సమస్యలను తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు అయోమయ స్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురోగామి దిశగా సాగుతోందని చెప్పారు. పారిశ్రామిక రంగానికి హైదరాబాద్ అనువైన కేంద్రమని ప్రపంచం మొత్తం ఆలోచించే స్థితికి.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. -
ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాలి: ఆర్.కృష్ణయ్య
హస్తినాపురం (హైదరాబాద్) : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... స్వచ్ఛభారత్-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి పెరిగిందన్నారు. కాగా నందనవనం కాలనీలో రేషన్ సరుకులను డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికు నేతలు పలువురు పాల్గొన్నారు. -
'స్వచ్ఛ'మే లక్ష్యం
-
ఏం తమాషాలు చేస్తున్నారా ?
హైదరాబాద్: ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ అధికారులపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం అంబర్‌పేటలోని కాద్రిబాగ్లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొన్నారు. స్థానిక కాలనీలో వసతులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. విద్యుత్, నీటి సరఫరాపై స్థానికుల నుంచి పోచారంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఆయన ఉన్నతాధికారులను ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ నిలదీశారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలిని.... అలాగే నీటి సరఫరా జరిగిలే చర్యలు తీసుకోవాలని పోచారం ఉన్నతాధికారులను ఆదేశించారు. -
విశ్వ నగరంగా మార్చే క్రమంలోనే...
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లి డివిజన్లోని సుందరయ్య పార్కులో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ
సైదాబాద్ (హైదరాబాద్) : హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సైదాబాద్ డివిజన్ దోభీఘాట్ సమీపంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు రోడ్లను ఊడ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించారు. నగరం మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ప్రచార ఆర్భాటమే...
-
స్వచ్ఛ హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖులు
బంజారాహిల్స్ (హైదరాబాద్): సినీ నటులు తమ అభిమానులను స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోరారు. ఆదివారం ఫిలింనగర్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే నంబర్‌వన్‌గా చేసే బాధ్యత తాను చేపడతానని తలసాని హామీ ఇచ్చారు. పరిసరాలను, రహదారులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానికులదేనని అన్నారు. రూ.25 కోట్లతో మూడేళ్లలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ హీరోలు వెంకటేష్, రానా, రాజశేఖర్, నటి రకూల్ ప్రీత్‌సింగ్, దర్శకులు కె. రాఘవేందర్రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, నటులు వేణుమాధవ్, తనికెళ్ల భరణి, విజయ్‌చందర్, హేమ, శివాజీరాజా, ఉత్తేజ్, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిలింనగర్ లో స్వచ్ఛ హైదరాబాద్
-
ఫిలింనగర్ లో స్వచ్ఛ హైదరాబాద్
-
ఫిలింనగర్ లో స్వచ్ఛ హైదరాబాద్ : పాల్గొన్న ప్రముఖులు
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో రెండో రోజు ఆదివారం కొనసాగుతుంది. ఫిలింనగర్లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా, సందీప్ కిషన్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సరేంద్రరెడ్డి, ఎన్. శంకర్‌తోపాటు వేణుమాధవ్, ఉత్తేజ్, తనికెళ్ల భరణి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్బీటీ నగర్లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రహదారులు, కూరగాయల మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. అలాగే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అమీర్‌పేటలోని శివబాగ్ కాలనీలో స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతంలో కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో హరీష్‌రావు, కేకే
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావులు పాల్గొన్నారు. వారు ఆదివారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు.12లో ఉన్న ఎన్బీటీ నగర్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న కడియం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎస్ఆర్నగర్-శివబాగ్లో ఆయన స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. -
‘స్వచ్ఛ హైదరాబాద్’కు సంఘటిత కృషి
‘స్వచ్ఛ హైదరాబాద్’లో గవర్నర్, సీఎం మంత్రులు, అధికారుల భాగస్వామ్యం {పజలు, ప్రజా సంఘాలు మమేకం భాగ్య నగరం కదిలింది. ‘స్వచ్ఛ’ గీతిని ఆలపించింది. బంజారాహిల్స్ నుంచి బతుకమ్మ కుంట దాకా... గోల్కొండ ఖిల్లా నుంచి గోల్నాక బస్తీ దాకా...చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చింది. మంత్రులు... ప్రజాప్రతినిధులు... ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు... సామాన్యులను కలసికట్టుగా ముందుకు నడిపించింది. బస్తీల వైపు అడుగులు వేయించింది. ఏళ్ల తరబడి ‘పరిశుభ్రత’కు దూరంగా... చెత్త కుప్పలు... ముసిరే దోమలు...ఈగలతో సహవాసం చేస్తూ... అనారోగ్యమే ఆస్తిపాస్తులుగా బతుకుతున్న మురుగువాడల జనాలకు ‘స్వచ్ఛ’మైన వాతావరణం కల్పించేందుకు శనివారం తొలి అడుగు వేయించింది. స్పీకరూ.. స్వీపరూ.. సంపన్నులు.. ఆపన్నులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై... చెత్త కుప్పలను తొలగించేలా చేసింది. అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రామికులైన తీరు... శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యంగా పడిన ఈ అడుగు... గమ్యం చేరేదాకా అప్రతిహతంగా సాగాలని దరూ కాంక్షించేలా కొత్త స్ఫూర్తిని నింపింది. సికింద్రాబాద్/బౌద్దనగర్ ప్రజలు, అధికారులు సమష్టిగా, సంఘటితంగా పనిచేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ పరిధిలోని పార్శిగుట్ట ప్రాంతంలో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సమస్యలను సమూలంగా పరిష్కరిస్తానని, అందుకు బస్తీవాసులు తనకు సహకరించాలని కోరారు. దాదాపు గంటపాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం కేవలం పార్శిగుట్ట ప్రాంత బస్తీలు సమస్యలు, పరిష్కార మార్గాలపైనే సాగింది. గతంలో అత్యంత సమస్యాత్మక నగరాలుగా ఉంటూ అనంతర కాలంలో ప్రపంచంలో పేరొందిన నగరాలుగా గుర్తింపు పొందిన జెనీవా, రియోడిజినీరో స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బస్తీలో పార్కు, మార్కెట్ ఏర్పాటుకు ఖాళీ స్థలాల వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ముగిసేలోపు ఈ పని పూర్తి చేయాలని సూచించారు. కళాశాల ఏర్పాటుకు హామీ మారుమూల గ్రామాల్లో సైతం మంచి ప్రభుత్వ విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు ఉండగా, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం విచారకరమన్నారు. పార్శిగుట్ట ప్రాంతంలోనే మంచి విద్యాలయంతోపాటు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడు బస్తీలు... ఏడు సమావేశాలు ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా పార్శిగుట్ట యూనిట్ పరిధిలోని ఏడు బస్తీల సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని, రేపటి నుంచి బస్తీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. బస్తీకి యాభై మంది చొప్పున ఆహ్వానించి స్థానిక సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పార్శిగుట్టకు వస్తానని... తొలి సమావేశాన్ని వెంటనే ప్రారంభిస్తానన్నారు. మధ్యలో ఒకగంట పాటు సచివాలయానికి వెళ్లి ఫైళ్లు చూసుకుని తిరిగి వచ్చి రాత్రి పదిగంటల వరకైనా అన్ని బస్తీల సమావేశాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం కనుగొంటానన్నారు. బంగ్లాదేశ్ ప్రొఫెసర్ ఆదర్శం కావాలి లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో పని చేస్తే జవాబు దొరకని సమస్య ఉండదని, పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ యూనెస్ మనకు ఆదర్శం కావాలన్నారు. ఆరుగురు మహిళల జీవితాలను అధ్యయనం చేసిన ఆయన వడ్డీ వ్యాపారుల కారణంగా మహిళలు నష్టపోతున్న తీరును గుర్తించి వారిని పొదుపు సంఘంగా తీర్చిదిద్దారని, అదే నేడు 17 వేల మహిళా సంఘాల ఏర్పాటుకు బీజం వేసిందన్నారు. సమస్యలపై చర్చిద్దాం ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు రాలేదని, ఒక సామాన్య కార్యకర్తగా వచ్చానని కే సీఆర్ అన్నారు. అన్ని విభాగాల అధికారులు ఇక్కడే ఉన్నందున స్థానిక సమస్యలను ప్రశాంతంగా తనతో చర్చించేందుకు సమయం కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు... నాలా స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే ముంపు సమస్యకు కారణమని, కొద్ది మంది కోసం ఏటా అందరినీ నీటముంచడం మంచిది కాదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాలు ఆలోచిద్దామన్నారు. బస్తీ వాసులు ముందుకు వస్తే అదే ప్రాంతంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్శిగుట్ట నుంచి పాదయాత్ర ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పార్శిగుట్ట నుంచి మధురానగర్‌లోని రాఘవ ఫంక్షన్ ప్యాలెస్‌కు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఆయన మంత్రి టి.పద్మారావుగౌడ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజు, నోడల్ అధికారి కార్తీక్, బిల్‌కలెక్టర్ నర్సింగరావుతో సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఉత్తర మండల డీసీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అందమైన నగరాన్ని నిర్మిద్దాం సమశీతోష్ట వాతావరణ మండలాల మధ్య ఉన్న హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య నగరం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘ మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. భూకంపాల ముప్పు లేదు. మంచి పనులు చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయనే మన పెద్దల మాట నిజమవుతోంది. బండారు దత్తాత్రేయ, గవర్నర్, తదితరులు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.200 కోట్లు ఖర్చు పెడుతోంది. భవిష్యత్ తరాలకు అందమైన నగరాన్ని అందిద్దాం. అందరం కలిసి మనవంతుగా కొంత చెత్తను తొలగిస్తే... నిత్యం నగర వీధులను శుభ్రం చేస్తున్న సఫాయీ కర్మచారులకు కొంత భారం తగ్గుతుంది. ఆ దిశగా కదులుదాం.. రండి..! - కె.చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి -
'స్వచ్ఛ హైదరాబాద్'లో డివిజన్‌కు రూ. 50 లక్షలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి డివిజన్‌కు రూ.50లక్షలను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ వెల్లడించారు. ఆయన గురువారం ఈ కార్యక్రమంపై స్థానిక జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్‌ను ఓ మహాయజ్ఞంలా చేపట్టాలని సూచించారు. ప్రతి కాలనీలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. పోలీసులు సైతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో విధిగా హాజరుకావాలని సూచించారు. -
పోలీస్ క్వార్టర్స్‌లో 'స్వచ్ఛ హైదరాబాద్'
హైదరాబాద్ : లాఠీలు పట్టిన చేతులు చీపుళ్లు పట్టాయి. నేరాల అదుపుకు పాటుపడే వారు పరిసరాల పరిశుభ్రత కోసం నడుం వంచారు. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఐ కిరణ్ అధ్వర్యంలో బోయిన్పల్లి పోలీసులు తమ క్వార్టర్స్ సముదాయంలో గురువారం శ్రమదానం చేశారు. కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పారిశుద్య సిబ్బందితో భూగర్భ డ్రైనేజీ పూడిక తీయించారు. విద్యుత్‌శాఖ అధికారులతో వేలాడుతున్న సర్వీసు వైర్లను తొలగింపజేసి నూతన తీగలు ఏర్పాటు చేయించారు. అనంతరం నార్త్‌జోన్ అదనపు డీసీపీ వీవైగిరి మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలు నివసించే క్వార్టర్స్‌లో కంటోన్మెంట్ బోర్డు అధికారులు వీధి దీపాల ఏర్పాటు, పారిశధ్య సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సినీ నటుల సేవలు వాడుకుంటాం: కేసీఆర్
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగరాన్ని 400 వందలు విభాగాలుగా విభజించి ఇంఛార్జ్ లను నియమించి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలన్నారు. ఇందుకోసం సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. మే 6న స్వచ్ఛ హైదరాబాద్ అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16న గవర్నర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు.