
చర్లపల్లి జైల్లో స్వచ్ఛ హైదరాబాద్
కుషాయిగూడ (హైదరాబాద్) : చర్లపల్లి సెంట్రల్ జైల్లో శనివారం ఉదయం 'స్వఛ్చ హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జైలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జైలు ఆవరణ, క్వార్టర్స్‌లో నెలకొన్న చెత్తా, చెదారం, పిచ్చి, మొక్కలను తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు రోగాలు మన దరికి చేరవని జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు.