సినీ నటుల సేవలు వాడుకుంటాం: కేసీఆర్
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగరాన్ని 400 వందలు విభాగాలుగా విభజించి ఇంఛార్జ్ లను నియమించి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలన్నారు. ఇందుకోసం సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు.
మే 6న స్వచ్ఛ హైదరాబాద్ అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16న గవర్నర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు.