ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాలి: ఆర్.కృష్ణయ్య | LB Nagar MLA Krishnaiah Participates in Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాలి: ఆర్.కృష్ణయ్య

Published Wed, May 20 2015 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

LB Nagar MLA  Krishnaiah Participates in Swachh Hyderabad

హస్తినాపురం (హైదరాబాద్) : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... స్వచ్ఛభారత్-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి పెరిగిందన్నారు. కాగా నందనవనం కాలనీలో రేషన్ సరుకులను డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికు నేతలు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement