MLA Krishnaiah
-
‘పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం’
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధం గా రావాల్సిన 34% రిజర్వేషన్లను తగ్గించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామపంచాయతీల్లో బీసీలకు 4,335 స్థానాలు కేటాయించాలని, కానీ ఎస్టీలకు కేటాయించిన స్థానాలు తీసేసి మిగిలిన 10,117 గ్రామపంచాయతీలకు గానూ 34% రిజర్వేషన్‌తో కేవలం 3,440 స్థానాలనే బీసీలకు కేటాయించారన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 56 శాతానికి పెంచుతామన్న కేసీఆర్.. సీఎం అయ్యాక ఉన్న రిజర్వేషన్లను 27 శాతానికి తగ్గించాలని చూడటం సిగ్గు చేటన్నారు. రిజర్వేషన్లను తగ్గించకుండా బీసీలకు తగిన స్థానాలను కేటాయించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాలి: ఆర్.కృష్ణయ్య
హస్తినాపురం (హైదరాబాద్) : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో శ్రమ సంస్కృతి కలుగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. బుధవారం కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... స్వచ్ఛభారత్-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి పెరిగిందన్నారు. కాగా నందనవనం కాలనీలో రేషన్ సరుకులను డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికు నేతలు పలువురు పాల్గొన్నారు.