నల్లకుంట (హైదరాబాద్) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కరెంట్ లేక అంధకారంగా మారుతుందని అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఏ చీకట్లో ఉన్నాడో.. కనబడడంలేదని... స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగుల్లో ఉందంటూ ఆయన... మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం న్యూ నల్లకుంట నరేంద్ర పార్క్‌లో పార్క్ సొసైటీ సభ్యులతో సమావేశమయ్యారు. పార్క్ సమస్యలను తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు అయోమయ స్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురోగామి దిశగా సాగుతోందని చెప్పారు. పారిశ్రామిక రంగానికి హైదరాబాద్ అనువైన కేంద్రమని ప్రపంచం మొత్తం ఆలోచించే స్థితికి.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు.