హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు, టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే. కేశవరావులు పాల్గొన్నారు. వారు ఆదివారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు.12లో ఉన్న ఎన్బీటీ నగర్‌లో నిర్వహిస్తున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.