ఏం తమాషాలు చేస్తున్నారా ?
హైదరాబాద్: ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ అధికారులపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం అంబర్పేటలోని కాద్రిబాగ్లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొన్నారు. స్థానిక కాలనీలో వసతులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.
విద్యుత్, నీటి సరఫరాపై స్థానికుల నుంచి పోచారంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఆయన ఉన్నతాధికారులను ఏం తమాషాలు చేస్తున్నారా ? అంటూ నిలదీశారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలిని.... అలాగే నీటి సరఫరా జరిగిలే చర్యలు తీసుకోవాలని పోచారం ఉన్నతాధికారులను ఆదేశించారు.