
ఫిలింనగర్ లో స్వచ్ఛ హైదరాబాద్ : పాల్గొన్న ప్రముఖులు
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో రెండో రోజు ఆదివారం కొనసాగుతుంది. ఫిలింనగర్లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా, సందీప్ కిషన్, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, సరేంద్రరెడ్డి, ఎన్. శంకర్తోపాటు వేణుమాధవ్, ఉత్తేజ్, తనికెళ్ల భరణి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్బీటీ నగర్లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రహదారులు, కూరగాయల మార్కెట్ను ఆయన పరిశీలించారు. అలాగే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అమీర్పేటలోని శివబాగ్ కాలనీలో స్వచ్ఛభారత్లో పాల్గొన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతంలో కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు.