హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి డివిజన్‌కు రూ.50లక్షలను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ వెల్లడించారు. ఆయన గురువారం ఈ కార్యక్రమంపై స్థానిక జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ హైదరాబాద్‌ను ఓ మహాయజ్ఞంలా చేపట్టాలని సూచించారు. ప్రతి కాలనీలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. పోలీసులు సైతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో విధిగా హాజరుకావాలని సూచించారు.