
విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతి: వీహెచ్
హైదరాబాద్: మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు(వీహెచ్) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. బిహార్‌లో మద్యపాన నిషేధానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఇది అభినందనీయమన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా మద్య నిషేధం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ అశం పై అన్ని పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ సూచించారు.