
'అదృష్టం ఉంటే తెలంగాణకు సీఎం అవుతా'
హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, అంబర్పేట అసెంబ్లీ అభ్యర్థి వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అదృష్టం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని హనుమంతరావు అన్నారు.
చంద్రబాబు సంధించిన బీసీ రామబాణం డూప్లికేట్దని అంతకుముందు హనుమంతరావు కొట్టిపారేశారు. చంద్రన్న బీసీ బాణానికి ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో వస్తే బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.