
‘బేగంపేట’కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చెన్నైలో విమానాశ్రయానికి రెండు పేర్లున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు.
అక్కడ అంతర్జాతీయ, దేశీయ టర్మినల్‌లు రెండూ వేర్వేరుగా ఉన్నాయి. కానీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలకు ఒకటే ద్వారం ఉంది. ఒక్క విమానాశ్రయానికి రెండు పేర్లెలా పెడతారు’’ అని ప్రశ్నించారు.