
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికిపైగా డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్‌గోల్ నెరవేర్చుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల్లో కొట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కొడుకును సీఎం చేయడం కోసమే ముందస్తు : వీహెచ్
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఆరోపించారు. నిజామాబాద్‌లోని కల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు. ‘కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్‌లో పెడతా. కేసీఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతానని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment