ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్ : ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీతో కాంగ్రెస్ ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు. 2019లో టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్దే విజయం అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.