MLA chinna reddy
-
కాంగ్రెస్‌కు మంచిరోజులు : ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి అర్బన్ : కాంగ్రెస్‌కు మంచిరోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. మండలంలోని కాశీంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కందిరీగ తండాలో ఆదివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీలతో పాటు మహిళా విభాగం, యువజన విభాగం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంజనగిరి తండా, మేఘ్యతండా, కందిరీత తండా, ఎద్దుల గేరీ, నాగమ్మతండా, కాశీంనగర్, ఎర్రగట్టుతండాల్లో కమిటీలు వేశారు. కార్యక్రమంలో రమేష్‌నాయక్, లాలునాయక్, మన్యంనాయక్, శివసేనారెడ్డి, ధనలక్ష్మీ, సహదేవ్, తిరుపతయ్య, కిరణ్, సత్యంసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వామిగౌడ్ డ్రామాలు ఆడుతున్నారు
సాక్షి, వనపర్తి: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ డ్రామా లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో 11 మంది కాంగ్రెస్ సభ్యులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ జాబితాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా ఉండగా ఆయన మంగళవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ గొడవ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని సీఎం గుర్తించాలని సూచించారు. కేసీఆర్ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ అని ఈ బడ్జెట్ లో జరిగిన లోపాలపై కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. -
మహిళా డిగ్రీ కళాశాల స్థలం ‘డబుల్ ’ఇళ్లకు..
వనపర్తిటౌన్: వనపర్తిలో మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయించారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. అందువల్లే కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఉపముఖ్యమంత్రి సూచన మేరకు మార్చారని చెప్పారు. అదే సమీపంలో 8ఎకరాలు కేటాయిస్తే రూ.19కోట్ల 40లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పెద్దమందడికి మంజూరైన ఎస్సీ బాలికల రెసిడెన్షియల్ బుద్దారం గండిలోని ఎస్సీ రెసిడెన్షియల్‌లోనే కొనసాగుతుందని, దాని సొంత భవన నిర్మాణానికి రూ.13కోట్ల 10లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే చిన్నమందడిలో ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తామన్నారు. శ్రీరంగాపూర్‌కు బాలుర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వనపర్తిలో 6వ వార్డుకు అంగన్వాడీ సెంటర్ మంజూరైందని, గార్లబండతండా, ఊరంచుతండా, సవాయిగూడెంతండా, కారడిగూడిసెతండా, లక్ష్మీనగర్‌తండా, బోక్యాతండా, ధన్సింగ్తం డా, కాలిబిక్యాతండా తదితర ప్రాంతాలకు మీనీ అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారు. రాహుల్‌గాంధీ స్ఫూర్తి, కాం గ్రెస్ సిద్దాంతాలను నమ్మి ఎన్ఎస్యూ సభ్యత్వం తీసుకున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్, జిల్లా అధ్యక్షుడు కృష్ణవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాధర్, వెంకటేష్, వెంకటస్వామి, భువనేశ్వరి, ఖమర్మియ్యా, విజయలక్ష్మీ, నందిమల్ల శ్యామ్, రాధాకృష్ణ, చంద్రమౌళి, ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్లా, జాన్ పాల్గొన్నారు. -
ప్రజల మనిషి వైఎస్ఆర్
వనపర్తి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషి అని వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కొనియాడారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ఆర్ హయాంలో అమలుచేసిన ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేశారు. ఎందరో ప్రాణాలు కాపాడిన సంజీవని ఆరోగ్యశ్రీ పథకం నేటికీ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పస్పుల తిరుపతయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, కౌన్సిలర్ కష్ణబాబు, నందిమల్ల శ్యాంకుమార్, చంద్రమౌళి, రాగివేణు, అక్తర్, శేఖర్, బాబా, ధనలక్ష్మి, నాగన్న యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
'ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి కేసీఆర్'
హైదరాబాద్ : ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీతో కాంగ్రెస్ ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు. 2019లో టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్‌దే విజయం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. -
ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు కేటాయించిన నిధులతో ఎప్పటికి పనులు పూర్తి చేస్తారన్నారు. వాస్తవ పరిస్థితులను గుర్తించి నిధుల కేటాయింపులు జరగాలన్నారు. అలాగే విద్యుత్ సమస్య ఉన్నందున ఆ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలే మిగులు వ్యయం కలిగి ఉన్నాయని చెప్పుకుంటూ...మరోవైపు ప్రజలపై వ్యాట్ పెంపు చేయటం దారుణమన్నారు. -
‘జూరాల- పాకాల’ సమ్మతమేనా?
నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిరూరల్ : జిల్లా నుంచి 70 టీఎంసీల నీటి ని తీసుకువెళ్లేందుకు రూపకల్పన చేసి న జూరాల-పాకాల ప్రాజెక్టుకు అంగీకరించావా? అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నిరంజన్‌రెడ్డి ఆధారలతో సహా ప్రజల ముందుకొచ్చి తాను నె ట్టెంపాడుపై రాసిన వ్యాసం చూపించాలన్నారు. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆదివారం వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం బాగుండాలనే ఉద్దేశంతో దివంగత సీ ఎం వైఎస్ఆర్ హయాంలో రూ.7469. 37కోట్ల నిధులతో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 90శాతం పనులు చేయించిన ఘనతఆయనకే దక్కిందన్నారు. తెలం గాణ మొదటి బడ్జెట్లో ఎంజీఎల్‌ఐ, కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టుల పాత బకాయి బిల్లుల చెల్లింపులకు కేసీఆర్ బడ్జెట్లో కేవలం రూ. 310 కోట్లు వెచ్చించడం శోచనీయమన్నారు. పెద్దాయనే బతికిఉంటే జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిచేసుకుని జిల్లా సస్యశ్యామం అయ్యేదని గుర్తుచేశారు. జూరాల- పాకాల పేరుతో జిల్లాలో ఉన్న ఏకైక ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నారని, నెట్టెంపాడు ప్రాజెక్టు సామర్థ్యం 40 టీఎంసీలకు పెంచి ఆ తరువాతే జూరాల- పాకాలకు సిద్ధంకావాలని సూచించారు. కాదని పూనుకుంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం సరికాదు జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ పర్యటన కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించాల్సి ఉండేదని, అందరితో కలిసి జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తే బాగుండేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. మెమోరాండం సిద్ధం చేసుకున్న తరువాత కేవలం మహబూబ్‌నగర్ టౌన్ వారు ఆహ్వానితులని చెప్పడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ శంకర్‌నాయక్, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.