
సాక్షి, వనపర్తి: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ డ్రామా లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో 11 మంది కాంగ్రెస్ సభ్యులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ జాబితాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా ఉండగా ఆయన మంగళవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రతిరోజూ గొడవ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని సీఎం గుర్తించాలని సూచించారు. కేసీఆర్ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ అని ఈ బడ్జెట్ లో జరిగిన లోపాలపై కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment