అన్నా.. పచ్చ కండువా కప్పుకో! | Our party colored scarf carf! | Sakshi
Sakshi News home page

అన్నా.. పచ్చ కండువా కప్పుకో!

Published Tue, Jun 10 2014 1:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

Our party colored scarf carf!

ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, స్వామిగౌడ్‌లకు అరికెల ఆఫర్

హైదరాబాద్: ‘ఏ రంగైతే ఏందన్నా... మా పార్టీ రంగు కండువా కప్పుకో’ అన్నట్టుగా శాసనమండలిలో టీడీపీ పక్ష నాయకుడు అరికెల నర్సారెడ్డి సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు ఆఫర్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఎన్నికల ముందు కారెక్కిన పి.నరేందర్ రెడ్డి మండలిలో ప్రమాణం చేసి వెళ్తుండగా... చివరి వరుసలో కూర్చొన్న అరికెల నర్సారెడ్డి నవ్వుతూ తన మెడలోని పచ్చజెండా తీసి తీసుకోమన్నట్టుగా సైగలు చేశారు.

దీంతో నరేందర్‌రెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. అలాగే చివరలో మరో ఎమ్మెల్సీ స్వామి గౌడ్‌ను ప్రమాణం చేయాల్సిందిగా చైర్మన్ విద్యాసాగర్ పిలిచినప్పుడు.. ఆయన మెడలో టీఆర్‌ఎస్ కండువా లేదు. దాంతో కండువా ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డిని అడిగారు. ఇది గమనించిన అరికెల పచ్చ కండువా తీసి స్వామిగౌడ్‌కు ఆఫర్ చేశారు. అప్పటికే సుధాకర్‌రెడ్డి స్వామిగౌడ్‌కు కండువా ఇవ్వడంతో అది తీసుకొని ప్రమాణం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement