హైదరాబాద్: ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. పురాణం సతీష్, భూపతి రెడ్డి, భాను ప్రసాద్, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కొండా మురళి, లక్ష్మినారాయణ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.