సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని దర్బారు హాల్‌లో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు వరుసగా ప్రమాణం చేశారు. అంతా కలిపి ఏడు నిమిషాల్లోనే ప్రమాణం చేయడంతో కార్యక్రమం పూర్తిగా పది నిమిషాల్లోనే ముగిసింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్ నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీల సొంత జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన కొత్త ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
Published Fri, Jun 5 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement