వైఎస్‌ఆర్‌కు నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు
వనపర్తి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషి అని వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి కొనియాడారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్‌ఆర్ హయాంలో అమలుచేసిన ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేశారు. ఎందరో ప్రాణాలు కాపాడిన సంజీవని ఆరోగ్యశ్రీ పథకం నేటికీ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ అభిమానులు రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పస్పుల తిరుపతయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, కౌన్సిలర్ కష్ణబాబు, నందిమల్ల శ్యాంకుమార్, చంద్రమౌళి, రాగివేణు, అక్తర్, శేఖర్, బాబా, ధనలక్ష్మి, నాగన్న యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.