ఎన్‌ఎస్‌యూఐ లక్ష్యాలను విద్యార్థులకు వివరిస్తున్న చిన్నారెడ్డి
వనపర్తిటౌన్: వనపర్తిలో మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయించారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. అందువల్లే కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఉపముఖ్యమంత్రి సూచన మేరకు మార్చారని చెప్పారు. అదే సమీపంలో 8ఎకరాలు కేటాయిస్తే రూ.19కోట్ల 40లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పెద్దమందడికి మంజూరైన ఎస్సీ బాలికల రెసిడెన్షియల్ బుద్దారం గండిలోని ఎస్సీ రెసిడెన్షియల్‌లోనే కొనసాగుతుందని, దాని సొంత భవన నిర్మాణానికి రూ.13కోట్ల 10లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
త్వరలోనే చిన్నమందడిలో ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తామన్నారు. శ్రీరంగాపూర్‌కు బాలుర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వనపర్తిలో 6వ వార్డుకు అంగన్‌వాడీ సెంటర్ మంజూరైందని, గార్లబండతండా, ఊరంచుతండా, సవాయిగూడెంతండా, కారడిగూడిసెతండా, లక్ష్మీనగర్‌తండా, బోక్యాతండా, ధన్‌సింగ్‌తం డా, కాలిబిక్యాతండా తదితర ప్రాంతాలకు మీనీ అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం ఎన్‌ఎస్‌యూఐ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారు. రాహుల్‌గాంధీ స్ఫూర్తి, కాం గ్రెస్ సిద్దాంతాలను నమ్మి ఎన్‌ఎస్‌యూ సభ్యత్వం తీసుకున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్, జిల్లా అధ్యక్షుడు కృష్ణవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాధర్, వెంకటేష్, వెంకటస్వామి, భువనేశ్వరి, ఖమర్‌మియ్యా, విజయలక్ష్మీ, నందిమల్ల శ్యామ్, రాధాకృష్ణ, చంద్రమౌళి, ప్రభాకర్‌రెడ్డి, అబ్దుల్లా, జాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment