పోలవరం ప్రాజెక్టుతో అమలాపురం మునక?
ఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను మార్చకుండా చేపట్టినట్లయితే తెలంగాణ ప్రాంతానికే కాదు.. ప్రక్కనే ఉన్న అమలాపురం కూడా ముంపు బారిన పడుతుందని కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదని, పోలవరం డిజైన్ మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పోలవరం పేరు చెప్పి గతంలో అవినీతి జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి గిరిజనుల సమస్యల్ని అర్ధం చేసుకోవాలన్నారు.
రాజ్యసభలో పోలవరం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వీహెచ్.. పోలవరం ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదంటూనే, డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అలా చేయకుండా పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను యధాస్థితిలో చేపడితే అమలాపురం కూడా మునుగుతుందన్నారు.