
మీరాకుమార్‌ను ఓడిస్తారా..!
కేసీఆర్‌పై వీహెచ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించాలని సీఎం కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు.గురువారం ఆయన మాట్లాడుతూ మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు విధేయుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.