మీరాకుమార్‌ను అవమానిస్తారా! | Congress about Meera Kumar | Sakshi
Sakshi News home page

మీరాకుమార్‌ను అవమానిస్తారా!

Published Wed, Jul 5 2017 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress about  Meera Kumar

సీబీఐ కేసులకు భయపడే కోవింద్‌కు కేసీఆర్‌ మద్దతు: కాంగ్రెస్‌
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు ఆమోదంలో లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్‌ పాత్ర విస్మరించలేనిదని, అలాంటిది.. మద్దతుకోసం మీరాకుమార్‌ ఫోన్‌చేస్తే స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవమానించడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్, సురేశ్‌ శెట్కార్‌ తదిత రులతో కలసి వారు గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌కు మద్దతును ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ కేసులకు భయపడే కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారా, మరేమైనా రహస్య కారణాలున్నాయా అని ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement