![దళితులకు రక్షణ లేదు: వీహెచ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51500494715_625x300.jpg.webp?itok=LZvRALeh)
దళితులకు రక్షణ లేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఇసుక లారీలు తగలబెట్టారని, అయితే పోలీసులు ప్రమాదానికి కారణమైన నిందితులను వదిలేసి లారీలను తగలబెట్టిన దళితులను అదుపులోకి తీసుకొని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దళితులపై దాడులకు నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాలు పెరిగిపోతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని పేర్కొన్నారు. దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు.