నేనేం చేస్తానో మీరే చూడండి: వీహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ్యుడు వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టుపై ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆయనను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో మీరు గట్టిగా అభ్యంతరాలు లేవనెత్తుతారా అని నిలదీశారు. ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో తానేం చేస్తానో చూడడంటూ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే పోలవరం డిజైన్ మార్చి నిర్మించుకుంటే అభ్యంతరం లేదని గిరిజనులు స్పష్టం చేశారు. డిజైన్ మార్చకుండా పోలవరం నిర్మిస్తే చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. కాగా, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజకీయ ఏజేసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. టీజేఏసీ చైర్మన్ కోదంరామ్, సహా పలువురు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.