Tribals Protest
-
‘ప్రగతిభవన్’ పాదయాత్ర భగ్నం
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు చెప్పుకునేందుకు ప్రగతిభవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు.. పాత పట్టాదారు పాసు పుస్తకాలున్న వారందరికీ డిజిటల్ పాసుబుక్కులు ఇవ్వాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సర్వే నంబర్లు 30, 36, 39లోని పట్టాభూములను రైతులకు అప్పగించాలని, వెంకమ్మ చెరువు వరద కాలువ నిర్వాసితులకు ఎకరానికి రూ.8లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రగతిభవన్‌కు పాదయాత్రగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించారు. పోలీసులు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు ఆదివారం రాత్రినుంచే నచ్చజెప్పచూసినా గిరిజనులు ఒప్పుకోలేదు. 120 మంది గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాదయాత్రను ప్రారంభించారు. రామన్నగూడెం నుంచి గంగారం చేరుకునేలోగా అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చారు. పాదయాత్ర విరమించాలని సూచించారు. గిరిజనులు వినకపోవడంతో అదుపులోకి తీసుకుంటుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరస్పర దాడులతో ఆ ప్రాంతం రణరంగమైంది. ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు గిరిజన మహిళలపై లాఠీచార్జ్ చేశారు. రెండు డీసీఎం వ్యాన్లలో ఆందోళనకారులను బలవంతంగా ఎక్కించి ములకలపల్లి, కిన్నెరసాని పోలీస్స్టేషన్లకు తరలించారు. ‘చంటి బిడ్డతో ఉన్నానని చూడకుండా పోలీసులు నన్ను బలవంతంగా డీసీఎం వ్యాన్ ఎక్కించారు’ అని రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప బోరున విలపించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామ్మూర్తిలు తమపైకి పోలీసులను ఉసిగొల్పారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ములకలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. కాగా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు.. అటవీ, రెవెన్యూ సిబ్బందితో జాయింట్ సర్వే చేయించి, వారంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. అరెస్టయిన వారందరినీ పోలీసులు సాయంత్రానికి విడుదల చేశారు. -
పట్టించుకోని ఆదివాసీల గోడు
-
నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): జల్..జంగల్..జవీున్ అంటూ తమ హక్కుల సాధనకు ఉద్యమించిన అడవిబిడ్డలపై ఆనాటి సర్కారు తూటాల వర్షం కురిపించింది. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అనధికారికంగా ఎక్కువ మందే అసువులు బాసారు. ఈ నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్రంలో 2015 నుంచి పలు ఆంక్షలు సడలించడంతో స్వేచ్ఛగా వందలాది మంది ఆదివాసీలు ఇంద్రవెల్లికి వచ్చి అమరవీరుల స్తూపం వద్ద నివాళులరి్పస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా.. ఆదివాసీ సంఘాల అభ్యర్థన మేర కు జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతి ఇవ్వడంతో రెండు గంటల పాటు నివాళులరి్పస్తున్నారు. ఈ సారి కరో నా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం ఐదుగురితోనే అమరులకు నివాళులరి్పస్తామని ఆది వాసీలు నిర్ణయించారు. (కరోనా టీకాకు నేను వ్యతిరేకం: జొకోవిచ్ ) అసలేం జరిగిందంటే.. స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజనులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఉమ్మడి జిల్లా నలువైపులా నుంచి వచ్చిన గిరి పుత్రులతో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా వినకుండా ర్యా లీగా ముందుకు సాగారు. వారిని అడ్డుకొని గిరిజన యువతితో ఓ పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి సదరు పోలీస్‌పై దాడి చేయడంతో ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్ బాబు ) తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. పోలీసుల కాల్పులు జరుపగా ఎంతో మంది నేలకొరగగా.. 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో ఉంది. వైద్యం అందక సుమారు 60 మంది చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధరణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు నేటికీ నేరవెరలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలు.. కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. అమరులకు నివాళులరి్పంచేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఏటా ఘటన జరిగిన(ఏప్రిల్ 20) తేదీ కంటే రెండు రోజుల ముందే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరి సరాల్లో 144 సెక్షన్ విధించేవారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో అమరులకు నివాళులరి్పంచడానికి పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల బందోబస్తు లేకుండా సోమవారం స్తూపం వద్ద ముఖ్య నేతలు నివాళులరి్పంచనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు 30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్థానిక ఎస్సై గంగారం తెలిపారు. అమలుకు నోచుకోని హామీలు.. ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ స్తూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, రాష్ట్రం ఏర్పడ్డక హరీశ్‌రావులు సైతం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో ) ఇళ్లలోనే నివాళులరి్పంచండి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అమరులైన వారికి నివాళులరి్పంచడానికి ఎవరూ ఇంద్రవెల్లి రావద్దు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆదివాసీలు తమ తమ ఇళ్లలోనే నివాళులరి్పంచాలి. – సోయం బాపురావు, ఆదిలాబాద్ ఎంపీ (అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. 10 వేల ఫాలోవర్స్) ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం -
పటేల్ మహా విగ్రహానికి నిరసన సెగ
అహ్మదాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో గిరిజన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారన్న అనుమానంతో నర్మదా జిల్లాలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భిలిస్తాన్ టైగర్ సేన(బీటీఎస్) జిల్లా అధ్యక్షుడు మహేశ్ గాగుభాయ్, ఉపాధ్యక్షుడు మహేంద్ర వాసవతో పాటు మరో రెండు సంఘాలకు చెందిన సభ్యులు అరెస్టైన వారిలో ఉన్నారు. గాంధీయవాది చునీ వైద్య కుమార్తెలు నీతా విరోధి, మోదితా విరోధిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా ఆందోళనలకు జనాన్ని పోగు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) చెందిన ఝగదియా ఎమ్మెల్యే చోటూభాయ్ వాసవ కుమారుడు మహేశ్ వాసవ 2017లో బీటీఎస్‌ను స్థాపించారు. అత్యంత ఎత్తైన పటేట్ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాపీ జిల్లాలోని య్యరా ప్రాంతానికి చెందిన 10 మంది శిరోముండనం చేయించుకుని మద్దతు తెలిపారు. విగ్రహంతో ఒరిగేదేంటి? ‘సర్దార్ పటేల్‌కు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం. గుజరాత్లో గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాసింది. రాజ్యాంగంలోని 244(1) ఆర్టికల్‌ను ప్రభుత్వం అమలు చేయాలన్న మా ప్రధాన డిమాండ్. దీన్ని అమలు చేసిన తర్వాత పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోండి. ‘ఐక్యతా విగ్రహం’తో గిరిజనులకు ఏవిధంగా మేలు జరుగుతుంది? గిరిజనుల సమస్యలపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. గిరిజనుల హక్కుల సాధన కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం. ఫలితంగా ఎంతో మంది గిరిజనుల మద్దతు పొందగలిగామ’ని చోటూభాయ్ వాసవ పేర్కొన్నారు. తన కుమారుడు మహేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనాజీ గమిత్, ఆనంద్ చౌదరితో కలిసి సూరత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీకి బహిరంగ లేఖ కాగా, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ నర్మదా సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుతో సహజ వనరులను నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై 22 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు సంతకాలు చేశారు. స్థానిక గిరిజన నాయకులు కూడా ఐక్యతా విగ్రహావిష్కరణను వ్యతిరేకించారు. ‘ఈ రోజును బ్లాక్ డే పాటించాలని గిరిజనులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని గిరిజనులు ఈరోజు నిరహారదీక్ష చేయనున్నారు. మా ఆందోళన ఒక్కరోజుతో ఆగదు. మరిన్ని రోజుల పాటు పోరాటం కొనసాగిస్తాం. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సమస్యలపై కూడా ఆందోళన కొసాగుతుంద’ని చోటూభాయ్ స్పష్టం చేశారు. -
‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక!’
సాక్షి, న్యూఢిల్లీ : ‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక! మా గ్రామంలోకి అడుగు పెట్టొద్దు.....ఇక్కడి నేరు, నేల, అడవి మాది....1996 నాటి పంచాయతీ చట్టం ప్రకారం మాకు సంక్రమించిన హక్కులివిగో....’ అన్న ప్రకటనలు ఆ రాష్ట్రంలోని ఏ ఆదివాసి గ్రామానికి వెళ్లినా ఊరి పొలిమేరలోనే పాతిన ఓ రాతి పలక మీద కనిపిస్తాయి. ఇక ఊర్లోకి వెళితే కూడలి వద్ద మరో పెద్ద రాతి పలక కనిపిస్తుంది. దానిపైన ‘భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభే అన్నింటికన్నా సుప్రీం. పార్లమెంట్, అసెంబ్లీ, మరే వ్యవస్థ కూడా దీనికి మించినది కాదు’ అని రాసి ఉంటుంది. జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో 300లకుపైగా ఆదివాసీ గ్రామాల్లో ఈ హెచ్చరిక రాతి పలకలు కనిపిస్తాయి. రాష్ట్రంలోని ఆదివాసీలు తమ హక్కుల పరిరక్షిణలో భాగంగా ఈ నెలలో ‘పతాల్‌గడి’ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే వారు ఈ రాతి పలకలను పాతారు. స్థానిక ముండూర్ భాషలో ‘పతాల్‌గడి’ అంటే రాతి పలకను నిలబెట్టడం. ఈ ఆదివాసీల గ్రామాల్లో మరో విశేషం కనిపిస్తుంది. హిందీలోకి అనువదించిన భారత రాజ్యాంగం ప్రతి వీధి కొక్కటైనా కనిపిస్తుంది. అక్కడ కాస్త చదువుకున్న ఏ యువకుడిని అడిగినా ఆదివాసీల హక్కుల గురించి, గ్రామ సభలకున్న హక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2016 నుంచి రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తున్న 1876 నాటి సంతాల్ పరగణ టెనెన్సీ యాక్ట్, 1908 చోటా నాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్‌లను సవరిస్తూ జార్ఖండ్ అసెంబ్లీ సవరణలు తీసుకొచ్చింది. వాటి ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపించింది. ఈ రెండు చట్టాల ప్రకారం ఆదివాసీలు తమ భూములను ఇతర ఆదివాసీలకు మాత్రమే అమ్మాలి. ఆదివాసీలు కాని వారికి అమ్మకూడదు, అమ్మినా చెల్లదు. రాష్ట్ర అభివద్ధి కార్యక్రమాల కోసం, వివిధ ప్రాజక్టుల కోసం వీటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, ఇతరులకు కేటాయించవచ్చంటూ బిల్లుల్లో సవరణలు తెచ్చారు. వాటిని రాష్ట్ర గవర్నర్ పునర్ పరిశీలనకు పంపగా ఆయన వాటిని పునర్ పరిశీలించాలని కోరుతూ 2017, ఆగస్టులో తిప్పి పంపారు. ఆ రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చేయడంతో ఆ రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఆ బిల్లుల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భూసేకరణ బిల్లు–17’ను తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. రాష్ట్ర జనాభాలో ఇప్పటికీ 28 శాతం మంది ఉన్న ఆదివాసీలు ఈ తాజా బిల్లుకు వ్యతిరేకంగా ‘పతాల్‌గడ్’ ఆందోళన చేపట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన 15 మంది ఆదివాసీ నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వారిలో ఎక్కువ మందిపై ‘దేశద్రోహం’ కేసులు నమోదు చేశారు. ఉద్యమం సందర్భంగా ఆదివాసీలు మాజీ లోక్‌సభ స్వీకర్, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కరియా ముండా ముగ్గురు అంగరక్షకులను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత విడిచి పెట్టారు. ఉద్యమ కాలంలోనే ఐదుగురు రంగస్థల కళాకారులపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో తమతోపాటు మావోయిస్టులను ఇరికించారని పోలీసులు కుట్ర పన్నారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారన్న అభియోగంతో మావోయిస్టులను కూడా కేసులో ఇరికించాలని చూస్తున్నారని, నిజంగా తమకు మావోయిస్టుల సానుభూతి తప్ప మద్దతు ఎక్కడా లేదని జార్ఖండ్ డిసోమ్ పార్టీ అధ్యక్షుడు సల్కాన్ ముర్మూ తెలిపారు. మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని విశ్వసించరని, తాము మాత్రం భారత రాజ్యాంగానికి నిక్కచ్చిగా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఆదివాసీలకు స్థానిక చర్చిలు మద్దతిస్తున్నాయన్న కారణంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీల ఆందోళనతో తమకు సంబంధం లేదని, పైగా అభివద్ధిని కోరుకోని ఆందోళనలను తాము వ్యతిరేకిస్తామని ‘సెక్రటరీ జనరల్ ఆఫ్ ది క్యాథలిక్ బిషప్–కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ బిషప్ తియోదర్ మాస్కరెన్హాస్ చెప్పారు. తాము మాత్రం భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని సల్కాన్ ముర్మ హెచ్చరించారు. దేశంలో ప్రతి కోట్ల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారని, వారంతా ఒక్కటైతే తమ ఆందోళన విజయవంతం అవుతుందని ఆయన చెప్పారు. లేనిపక్షంలో మణిపూర్ తరహా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేయడమే మణిపూర్ తరహా ఆందోళన. ఈ ఉద్యమం ఆదివాసీలు ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి విస్తరిస్తే ప్రమాదమని, పైగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ అధిష్టానంలో ఆందోళనలో పడింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వారం అక్కడికి వెళుతున్నారు. -
ఆదివాసీలను అవమానిస్తారా?
సాక్షి, కొత్తగూడెం : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను, ఉద్యమకారులను తీవ్రంగా అవమానిస్తోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. గురువారం కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై మహాధర్నా నిర్వహించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని విమర్శించారు. గిరిజన రైతులను అవమానిస్తున్నారని, పోడు భూములకు పట్టాలు అడిగితే కేసీఆర్ సొంత ఆస్తిలో వాటా అడుగుతున్నట్లు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి పాలన చేస్తున్న కేసీఆర్ మగాడేనా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న కేసీఆర్ కుటుంం మాత్రమే బంగారంలా పదవులు అనుభవిస్తోందన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడిన ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు ఎత్తేయకుండా హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా తెలంగాణ ఇస్తే కేసీఆర్ తానే తెచ్చినట్లు భావించుకుంటున్నారని, కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కుండువాలు కప్పుకున్నవారికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తున్నారని అన్నారు. రెండు ట్రాక్టర్లు ఉన్నవారికే మూడో ట్రాక్టరు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసే సమయం ఉంటుంది కానీ.. ప్రజల సమస్యలు తెలుసుకునే తీరిక మాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మల్లు రమేష్, రాయల నాగేశ్వరరావు, మాలోత్ రాందాస్‌నాయక్, లకావత్ గిరిబాబు, హరిప్రియ, బాణోత్ పద్మావతి, లెనిన్, ధనుంజయ్‌నాయక్, ఏసుపాదం, దీపక్‌చౌదరి, సత్యనారాయణ చౌదరి, చెన్నకేశవరావు, దేవ్లానాయక్, ఓంప్రకాష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలు అందజేయండి
జయపురం ఒరిస్సా : తమ వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని నవరంగపూర్ జిల్లాలోని పడహండి సమితి ఖెందుగుడ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంత పరిధిలోని తమ పంట భూములకు పట్టాలు పంపిణీ చేసి, భద్రత కల్పించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టాలపై ఆంక్షలు విధించడాన్ని విడనాడాలంటూ నినాదాలు చేశారు. కొంతమంది అధికారులు అటవీ భూమి చట్టాలను ఉల్లంఘన చేస్తున్నారని ఆరోపించారు. బీఎస్ఎస్ చట్టాలను రద్దు చేసి, వ్యక్తిగత అటవీ అధికారం ప్రజలకు అప్పగించాలని కోరారు. అటవీ విభాగం అధికారులు అటవీ చట్టాలను తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన చట్టపరమైన అధికారాలను కూడా కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గతంలో జరిగిన అనేక గ్రీవెన్స్ సెల్‌లలో పట్టాల కోసం పలు విజ్ఞప్తులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, న్యాయం చేయాలని కోరారు. వ్యక్తిగత భూముల్లో మొక్కలు నాటారు రెండు నెలల క్రితం అటవీ విభాగం అధికారులు ఖెందుగుడ గ్రామంలోని సుమారు 3 వందల ఎకరాల అటవీ భూముల్లో బీఎస్ఎస్ కమిటీతో కలిసి మొక్కలు నాటి, కంచె వేశారన్నారు. దీంతో తమ భూములు కూడా కొన్ని అందులో ఉండిపోవడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు అదే భూమిలో గిరిజనుల వ్యక్తిగత భూములతో పాటు ప్రభుత్వ ఆస్తులైన శ్మశానవాటిక, సామాజిక అడవులు, పూజా స్థలాలు కొన్ని ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు మొక్కులు నాటడాన్ని పలువురు తప్పుబట్టారు. ఇదే విషయంపై జిల్లా అటవీ అ«ధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు ఉమ్మరకోట్ తహసీల్దార్, బీడీఓ, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. తమ సమస్యలను పట్టించుకోవాల్సిన అధికారులే పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని, బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో జెమా శాంత, సీతారాం శాంత, వార్డు సభ్యుడు బుధా శాంత, గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు. -
పోడు.. గోడు!
ఇల్లెందు (ఖమ్మం) : ఏజెన్సీలో పోడు సాగు గిరిజన రైతుల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది.. అటవీహక్కుల చట్టం కంటే ముందు నుంచి సాగులో ఉన్న భూములకు పట్టాలు రాలేదని గిరిజనులు వాపోతుండగా.., చట్టాన్ని సాకుగా చూపి ఆ తర్వాత నరికి భూములకు పట్టాలు పొందడం సాధ్యం కాదంటూ అటవీశాఖ పేర్కొంటోంది. ఇదిలా ఉండగా అటవీహక్కుల చట్టం తర్వాత నరికి భూముల్లో హరితహారంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ మూడేళ్లుగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది.. కానీ గిరిజన రైతులు కూడా అదే పట్టుతో ఉన్నారు. ఇల్లెందు ఏరియాలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అటు అటవీశాఖ, ఇటు ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఈ సమస్య గుదిబండగా మారింది. మొన్న మంకిడి కృష్ణ: ఇల్లెందు మండలం మసివాగు – కోటగడ్డకు చెందిన మంకిడి కృష్ణ ఊరికి సమీపంలో పోడు సాగు చేసుకుంటున్నాడు. జూన్ 29న ఆ భూమిలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వచ్చారు. దీంతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. అటు కుటుంబ సభ్యులు, ఇటు అటవీశాఖ ఉద్యోగులు హుటాహుటిన ఇల్లెందు తరలించి వైద్యం అందించారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణ ఖమ్మంలో వారం రోజులు పాటు ఉన్నత వైద్యం పొంది రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. నిన్న కున్సోత్ చంద్రు: మంకిడి కృష్ణ సంఘటన మరువకముందే రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండాకు చెందిన కున్సోత్ చంద్రు పురుగుల మందు తాగి ఖమ్మంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడంతో తీవ్ర మనస్థాపం చెంది అక్కడే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిని ఇల్లెందు వైద్యశాలకు, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. ఈ రెండు సంఘటనలు ఇల్లెందు ఏరియాలో సంచలనంగా మారాయి. 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మ, మరో నలుగురు రైతులు బోడియాతండా సమీపంలో 30 ఎకరాలు సాగు చేస్తున్నట్లు, ఈ భూమి విషయంలో అటవీశాఖ తమదేనని పేర్కొనడంతో ఆ రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పట్టాపత్రం లేదంటే ..ఆ భూమి అటవీ శాఖదేనంటా అటవీ ప్రాంతంలో ఏ వ్యక్తి వద్ద భూమి ఉన్నా అందుకు తగిన హక్కు పత్రం లేదంటే ఆ భూమి అటవీశాఖదేనని, దాన్ని స్వాధీనం చేసుకుని హారితహారంలో మొక్కలు నాటుతామని మూడు నెలల క్రితమే ఇల్లెందులో రెండు జిల్లాల అటవీశాఖ డీఎఫ్ఓలు రాంబాబు, కృష్ణగౌడ్, ఎఫ్డీఓ అశోక్‌రావు, రేంజర్ వెంకన్నలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎఫ్ఓ రాజారావు స్పష్టం చేశారు. కానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులకు చెందిన భూములకు ప్రభుత్వం ఇటీవల రైతుబంధు పథకం వర్తించింది. పట్టా పత్రాలు ఉన్నప్పటికీ అటవీశాఖ ఆ భూములను తమ భూములుగా పేర్కొంటుండడంతో సమస్య జఠిలంగా మారింది. -
అడవి బిడ్డల ఆక్రోశం..
శృంగవరపుకోట రూరల్/శృంగవరపుకోట : మండలంలోని మూలబొడ్డవర, దారపర్తి పంచాయతీలకు చెందిన గిరిజనులు ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎస్.కోటలోని అనంతగిరి రేంజ్ అటవీశాఖ కార్యాలయానికి శుక్రవారం పాదయాత్రగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి అధికారుల తీరును దుయ్యబట్టారు. విల్లంబులు ఎక్కుపెట్టడంతో పాటు డప్పులు వాయిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించారు. ఏపీ గిరిజన సంఘం నేతలు జె.గౌరీష్, మద్దిల రమణ, ఆర్.శివ, పి.ధోని, గెమ్మెల సన్నిబాబు, కేత వీరన్న, తదితరులు మాట్లాడుతూ, జీఓ 62 ప్రకారం రద్దైన వనసంరక్షణ సమితి భూములను గిరిజనులకు అప్పగించడంతో పాటు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ఆ భూములపై సాగు హక్కు కల్పించాలన్నారు. గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు అరికట్టాలని.. నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిశిఖర గ్రామాలకు వెళ్లే రహదారుల ఏర్పాటుకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలని కోరారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్సై జి.ఎస్.నారాయణ, హెచ్‌సీలు నాయుడు, సత్యనారాయణల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అధికారులతో వాగ్వాదం.. చిలకపాడు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన గిరిజనులను బెదిరించి ఫారెస్ట్ అధికారులు తీసుకున్న ఆధార్, రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఖాళీ తెల్ల కాగితాలకు సంతకాలు ఎందుకు చేయించుకున్నారని ఫారెస్టర్లు జె.రమణ, ఎం.సత్యనారాయణ, ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ, రిజర్వు ఫారెస్ట్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను 15 మందిపై అటవీచట్టం కేసులు నమోదు చేశామన్నారు. ఏ ఒక్క గిరిజనుడినీ బెదిరించలేదని.. ఆధార్, రేషన్‌కార్డులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇకపై గిరిజనుల జోలికి వచ్చినా, బెదిరింపులకు పాలపడినా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ ఏపీ గిరిజన సంఘ నేత జె.గౌరీష్ హెచ్చరించారు. -
గ్రానైట్‌పై పెద్దల కన్ను
కంచిలి: మండల పరిధిలో గిరిజన గ్రామాల్లో గ్రానైట్ క్వారీయింగ్ అనుమతులివ్వొద్దంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి నువాగడ రెవెన్యూ పరిధిలో గల క్రాంతినగర్ గ్రామానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 47లోని 5.5 హెక్టార్ల కొండలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. దీంతో ఈ కొండలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇదే అదునుగా తమ పలుకుబడి ఉపయోగించి కొండ చుట్టూ ఐటీడీఏ నిధులు రూ.32 లక్షలతో 1200 మీటర్ల మెటల్ రోడ్డును మంజూరు చేయించుకుని చకచకా పనులు చేపట్టేశారు. ఈ వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాబల్యంతో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బంధువుకే అనుమతి ఎమ్మెల్యే అశోక్‌కు చెందిన బంధువు ఈ కొండపై అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో పంచాయతీ నుంచి అనుమతి పొందారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. దీంతో తహసీల్దార్ డి.రామ్మోహనరావు తన సిబ్బందితో కలసి కొండ సమీప గ్రామాలైన నువాగడ, క్రాంతినగర్, రాజాశాంతినగర్ గ్రామాలకు గురువారం వెళ్లి విచారించారు. ఆ సమయంలో ఆయా గ్రామస్తులు చేరుకుని.. ఇక్కడ కొండను క్వారీయింగ్‌కు అనుమతివ్వొద్దంటూ నిరసన తెలిపారు. ఈ కొండకు ఆనుకుని తమ గ్రామాలున్నాయని, అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఈ కొండలో క్వారీయింగ్ చేస్తే తమ బతుకులు నాశనమవుతాయని ప్రాథేయపడ్డారు. క్వారీయింగ్‌కు పాల్పడితే ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో గిరిజనులు భీమాబిసాయి, లిమ్మో బిసాయి, గణేష్ సవర, మహేష్‌గొమాంగో, లావణ్యబుయ్య, కవిత గొమాంగో, ఇస్తాయెల్ గొమాంగో తదితరులు పాల్గొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే మనుషుల ఒత్తిళ్లతో సంబంధిత ఫైల్.. టెక్కలి ఏడీ మైన్స్‌కు.. అక్కడి నుంచి రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ అనుమతికి పంపించేశారు. బురుపడ కొండ కూడా.. మండలంలో కుంబరినౌగాం పంచాయతీ పరిధిలో బురుపడ గ్రామంలో సర్వేనంబర్ 167/1లో 3 హెక్టార్లలో ఉన్న కొండలో కూడా గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. దీనిని లీజు కోసం రాజాం ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి దరఖాస్తు చేశారు. దీనిపై గత సోమవారం స్థానిక గిరిజనులతో కలిసి మండల సీపీఐ నేతలు నిరసన తెలిపారు. దీనిపైన కూడా స్థానిక పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఎన్ఓసీ ఇచ్చేశారు. సంబంధిత ఫైల్‌ను కూడా టెక్కలి ఏడీ మైన్స్‌కు అనుమతుల కోసం పంపించారు. ఇలా మండలంలో గిరిజన గ్రామాల్లో ఉన్న రెండు క్వారీల్లో గ్రానైట్ నిక్షేపాల తరలింపు కోసం చేస్తున్న ప్రయత్నాలపై గిరిజనులు కన్నెర్ర జేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా క్వారీలు ఇక్కడ సాగించేది లేదంటూ ప్రతిఘటించటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్వారీలకు అడ్డుపడే వారిని ఏదోరకంగా భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి పోలీస్ కేసులు బనాయిస్తామని బెదిరింపులు ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక నిరసనకారుడిని బెదిరించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. నువాగడ రెవెన్యూ పరిధిలో గ్రానైట్ క్వారీయింగ్ కోసం ప్రతిపాదించిన కొండ -
ఆదివాసీలుగా గుర్తించండి
జయపురం: గిరిజనులైన తమను ఆదివాసీలుగా గుర్తించాలని జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో ఉంటు న్న దురువ సంప్రదాయ ప్రజలు, సబ్‌కలెక్టర్ లోకనాథ్ దొలబెహరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ మేరకు దురువ ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను పలుపేర్లతో గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను« దారువ, దురువ, ధురొవ తదితర పేర్లతో ప్రభుత్వం పరిగణిస్తోందని ఆరోపించారు. జయపురం వనవాసి పరిశోధన కేంద్రం పరిశోధకులు గోవర్ధన పండా నివేదిక ప్రకారం ఇక్కడ దారువ, దురువ, దురొవ అనేవారు లేరని, కేవలం దురువ సంప్రదాయ జాతివారు ఉన్నట్లు స్పష్టం చేశారని వినతి పత్రంలో వెల్లడించారు. ఈ దురువ జాతిని 2011 జనాభా లెక్కల్లో ఆదివాసీ, హరిజన జాబితా 17వ పరుసలో చేర్చారన్నారు. దురువ ప్రజలకు సొంత భాష ఉన్నప్పటికీ తమను ఆదివాసీలుగా గుర్తించడంలేదని వాపోయా రు. ఈ ఏడాది అనేక మంది దురువ జాతి విద్యార్థులను ఆదివాసీలుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని హాస్టల్స్ నుంచి వెళ్లగొడుతున్నారని ఆందోళన వెలి బుచ్చారు. అందువల్ల అటవీ భూమి పట్టాల ఆధారంగా దురువ విద్యార్థులను ఆదివాసీలుగా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పట్టా ల ఆధారంగా తమను ఆదివాసీలుగా గుర్తించాలని డిమాం డ్ చేశారు. ఆందోళనలో దురువ ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బుదయి దురువ, మహిళా నేతలు చక్రవర్తి దురువ, రాయిబలి దురువ, నీలావతి దురువ, మంగళదే యి దురువ, సువర్ణ దురువ తదితరులు పాల్గొన్నారు. -
భూములు వదిలేయం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా ధారూరు : ఎన్నోఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను వదిలివేయబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. వివరాలు.. మండలంలోని రాంపూర్‌తండా సమీపంలో 1 నుంచి 70 సర్వేనంబర్లలలో 1274.19 ఎకరాల భూములు నిజాం వారసురాలైన ఫజలున్నీసాబేగం పేరున ఉన్నాయి. 653.20 ఎకరాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో టెనెన్సీ ద్వారా పట్టాలిచ్చారు. మిగిలిన 620 ఎకరాలను దాదాపు 100 మంది గిరిజన రైతులు కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్నారు. ఫజలున్సీసాబేగం 1970లో మృతి చెందగా ఇప్పటి వరకు ఆరు వర్గాల వారు తామే వారసులమంటూ వచ్చి బెదిరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. గతేడాది కొందరు డూప్లికేట్ పత్రాలు సృష్టించి దొంగరిజిస్ట్రేషన్లు చేసుకోగా తాము ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. తాము సాగుచేసుకుంటున్న భూములను ప్రాణాలు పోయినా వదిలిపెట్టబోమని సర్పంచ్ పాండునాయక్ తెలిపారు. విషయం కోర్టులో ఉందని, పరిష్కారం అయ్యేవరకు విరాసత్ చేయరాదని సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు తహసీల్దార్ శ్రీనివాస్‌కు విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ద్వారా ఫజలున్నీసాబేగం వారసులు అశ్రఫ్ఖురేషి, అఫ్సర్ఖురేషిలు కోర్టు ఆర్డర్ తీసుకువచ్చారని, కోర్టు ఆదేశాన్ని అమలు చేయాల్సిందేనని తహసీల్దార్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కరించుకుంటే తమకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. వారసులు కేవలం విరాసత్‌లో తమపేర్లు నమోదు చేయాలని కోరుతున్నారని, భూములు కబ్జా ఇప్పించమని కోరడం లేదని వివరించారు. -
నేనేం చేస్తానో మీరే చూడండి: వీహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ్యుడు వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టుపై ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆయనను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో మీరు గట్టిగా అభ్యంతరాలు లేవనెత్తుతారా అని నిలదీశారు. ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో తానేం చేస్తానో చూడడంటూ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలవరం డిజైన్ మార్చి నిర్మించుకుంటే అభ్యంతరం లేదని గిరిజనులు స్పష్టం చేశారు. డిజైన్ మార్చకుండా పోలవరం నిర్మిస్తే చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. కాగా, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజకీయ ఏజేసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. టీజేఏసీ చైర్మన్ కోదంరామ్, సహా పలువురు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.